Woman hides four-year-old child in bag on flight from Istanbul to Paris

Woman hides child in hand luggage on flight to paris

France woman, four-year-old girl, transit zone, hide the child in a bag, Haiti, French authorities, Woman, Paris, Istanbul, prosecutors, airport authorities, Air France, Paris flight, Charles de Gaulle Airport, airport, bag, airline, plane

A woman who flew into Paris from Istanbul this week was found to have hidden a four-year-old girl in a bag on the plane, said Air France.

బ్యాగ్ లో నాలుగేళ్ల చిన్నారిని దాచి.. విమానంలో తీసుకెళ్తూ..

Posted: 03/10/2016 03:29 PM IST
Woman hides child in hand luggage on flight to paris

తనకు పిల్లలు లేరన్న బాధను దిగమింగుకోలేకపోయిన ఆ మహిళ ఓ నాలుగేళ్ల చిన్నారిని తీసుకుని వెళ్లే ప్రయత్నంలో యావత్ ప్రపంచమే అమె వైనానికి తెలుసుకుని విస్మయానికి గురైంది. అడ్డంగా అధికారులకు దోరికిపోయింది. అయితే అమె వ్యధను అర్థం చేసుకున్న అధికారులు ఫ్రెంచ్ దేశ పోలీసులు మత్రం అమెపై ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని నిర్ణయించుకున్నారు. అయితే ఎయిర్ ఫ్రాన్స్ విమాన సం్థ అధికారులు మాత్రం అమె ఎలా విమానంలోకి ఎక్కగలిగిందన్న విషయమై విచారణ చేపట్టారు.

అసలు విషయం ఏంటో చెప్పకుండానే క్లైమాక్స్ చెప్పినట్లు వుంది కదూ.. ఇస్తాంబుల్‌ నుంచి పారిస్‌ వెళ్తున్న విమానంలో.. నాలుగేళ్ల చిన్నారిని హ్యాండ్‌ లగేజీ బ్యాగులో పెట్టి తరలిస్తున్న ఓ మహిళ ఫ్రాన్సులో పట్టుబడింది. ఎయిర్‌ఫ్రాన్స్‌ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..  ఫ్రాన్స్‌కు చెందిన మహిళ బాలికను దత్తత తీసుకునే క్రమంలో ఇలా అక్రమంగా బ్యాగులో తీసుకొని వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు.

టర్కీలోని ఇస్తాంబుల్‌ నుంచి పారిస్‌కు పాపతో సహా వెళ్లేందుకు ప్రయత్నించగా పాపతో కలసి వెళ్లేందుకు అనుమతి లభించకపోవడంతో దిక్కుతోచని మహిళ ఓ ఐడియా వేసింది. రమారమి అధికారులు అమెను పక్కకు తీసుకువెళ్లే కూర్చోబెట్టిన తరువాత.. అమె తనకువచ్చిన ఐడియాను అమలు పర్చింది. అదేంటంటే మరో టిక్కెట్‌ కొనుక్కొని పాపను లగేజీ బ్యాగులో దాచి.. బ్యాగును చేతిలో పట్టుకుని ఫ్లైట్‌ ఎక్కేసింది. ఫైట్ లోనూ ఎవరికీ అనుమానం రాకుండా తన కాళ్ల వద్ద బ్యాగ్ ను వుంచింది. కానీ అక్కడే అమె ఓ తప్పు చేసింది.

బ్యాగులో దాచిపెట్టిన చిన్నారికి అర్జెంటుగా మూత్రం వచ్చింది. దీంతో చిన్నారి కదలడం మొదటుపెట్టింది. చిన్నారిని బ్యాగ్ నుంచి తీస్తుండగా గమనించిన ఇతర ప్రయాణికులు మొత్తం తతంగాన్ని గమనించి విమాన సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో విషయం వెలుగుచూసింది. అధికారులు విన్సెంట్‌ అనే మహిళను, ఆమెతో పాటు తీసుకొచ్చిన పాపను ఫ్రాన్స్‌లోని చార్లెస్‌ డి గౌలే విమానాశ్రయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. పిల్లల లేని మహిళ పడే అవేదనను అర్థం చేసుకున్న అధికారులు వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వదిలిపెట్టారు. కాగా ఘటనపై ఎయిర్ ప్రాన్స్ విమాన అధికారులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air France  Paris flight  Charles de Gaulle Airport  airport  bag  airline  plane  

Other Articles