Jagan slams TDP government over Amaravathi land scam

Ap cm chandrababu owining assets worth rs 2 lakh crore

chandrababu, andhra pradesh assembly, ys jagan mohan reddy, cbi enquiry, babu assets, Amaravathi land scam, Opposition leader YS Jagan, minister narayana, minister pathipati pullaRao

Andhra Pradesh Opposition leader YS Jagan slams TDP Government over capital amarvathi land scam in assembly.

ఔనా.., నిజమేనా..! బాబు గారి ఆస్తులు రూ.2 లక్షల కోట్లా,,?

Posted: 03/09/2016 02:43 PM IST
Ap cm chandrababu owining assets worth rs 2 lakh crore

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆస్తి ప్రస్తుత కాలంలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు నాయుడు తన పేరున, తన కుటుంబసభ్యుల పేరున వున్న ఆస్తుల వివరాలను ఏ ఏడాదికి ఆ ఏడాది వెల్డిస్తున్నప్పటికీ.. అది నిజం కాదని ఆయన ఆస్తులు లెక్కల్లో ఒకలా, తెర వెనుక మరోలా వున్నాయన్న అరోపణలు ఇప్పుడు అనునిత్యం వినిపిస్తున్నాయి. ఆయన బినామీగా పలు ఆస్తులను ఉన్నాయని వాటి విలువ సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలని ప్రతిపక్షం అరోపిస్తుంది.

ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ప్రతిపక్షం అరోపిస్తున్నట్లుగా తన ఆస్తికి తగిన ఆధారాలను తీసుకురావాలన్నరు. గాల్లో అరోపణలే చూయడం సమంజసం కాదన్నారు. తన బినామిలు ఎవరున్నారో కూడా ఆధారాలతో బయటపెట్టాలన్నారు. ఇక తన క్యాబినెట్ మంత్రులు అవినీతికి పాల్పడ్డారని నిరూపిస్తే.. తక్షణం వారిని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేస్తానన్నారు. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీలో మాట్లడిన ఆయన ఇంకా ఏమన్నారంటే..

*    రాజధాని కట్టుకోవడానికి మన దగ్గర డబ్బుల్లేవు
*    ల్యాండ్ పూలింగ్ కు రండని నేను పిలుపిస్తే 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు
*    రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా విపక్షాలు విష ప్రచారం చేశాయి
*    మా కేబినెట్ లోని ఇద్దరు మంత్రులపై ఆరోపణలు చేశారు
*    ఈ ఆరోపణలు వాస్తవమని తేలితే మంత్రులను తొలగిస్తా
*    బట్టకాల్చి మీద వేయడం కాదు
*    జాగ్రత్తగా ఉండండి, తమాషాలు పోవద్దు
*    ఎలాంటి ఎంక్వైరీలు ఉండకూడదనే నీతి నిజాయితీగా బతుకుతున్నా
*    ఎవరు నా బినామీలో ప్రూవ్ చేయాలని సవాల్ చేస్తున్నా
*    'సాక్షి' ప్రజాధనంతో పెట్టిన పేపర్
*    తప్పకుండా ఆ ఆస్తి తీసుకుంటాం, వదిలిపెట్టే సమస్యలేదు
*    పోలవరం నేను కట్టాలనే ఆశ లేదు, కేంద్రానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా
*    బీజేపీ నేతలు కూడా ప్రతిపక్షాలు మాదిరిగా విమర్శలు చేయడం సరికాదు
*    మంత్రులిద్దరిపై చేసిన ఆరోపణలు రుజువయ్యాకే సభ జరగాలి
*    రుజువు చేయాలి లేకుంటే క్షమాపణ చెప్పాలి
*    ఆ రెండు విషయాలు తేల్చిన తర్వాతే ముందుకెళ్లాలి

ఆ తరువాత ప్రసంగించిన వైసీపీ అధినేత, ఏపీ విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి అమరావతి భూఅక్రమాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసలు కారకుడని అరోపించారు. ఆయన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కన్నా దారుణమైన నేరానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రాజధాని భూముల కొనుగోళ్ల విషయంలో చంద్రబాబే పెద్ద దోషి అని ఆయన స్పష్టం చేశారు. ఈ భూ అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రాజధాని అమరావతిలో భూ అక్రమాలపై బుధవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే..

*   అమరావతి భూఅక్రమాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబే అసలు కారకుడు
*   ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కన్నా దారుణమైన నేరానికి చంద్రబాబు నాయుడు పాల్పడ్డారు
*   రాజధాని భూముల కొనుగోళ్ల విషయంలో చంద్రబాబే పెద్ద దోషి
*   భూ అక్రమాలపై సీబీఐ విచారణకు చంద్రబాబు, ఆయన ప్రభుత్వం సిద్ధమా..?
*   అమరావతిలో భూములు కొన్న చంద్రబాబు మంత్రులు విచారణకు సిద్దమా.?
*   ఫలానా చోట రాజధాని వస్తుందని తన బినామీలకు ముందే వెల్లడించిన చంద్రబాబు
*   రాజధాని స్థలంలో ముందుగానే తన బినామీలతో భూములను కొనిపించిన చంద్రబాబు
*   ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ కన్నా దారుణం..
*   చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలు కలిసి తనపై కేసుల్లో ఇరికించారు
*   కాంగ్రెస్ లో వున్నంత వరకు తనపై ఒక్క కేసూ లేదు
*   1978లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చంద్రబాబు ఆస్తి కేవలం రెండు ఎకరాలు మాత్రమే
*   ఇప్పుడు లక్షల కోట్ల ఆస్తులు చంద్రబాబుకు ఎక్కడి నుంచి వచ్చాయి..?
*   చంద్రబాబు ఆయన కుటుంబసభ్యుల ఆస్తులపై సిబీఐ విచారణకు సిద్దమా..?
*   సీబీఐ విచారణ అనగానే స్టే తెచ్చుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే..

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  andhra pradesh assembly  ys jagan mohan reddy  cbi enquiry  babu assets  

Other Articles