Kim Kardashian snaps back at Bette Midler over nude selfie comments

Kim kardashian west declares war with her body

Twitter battle, Oscar nominee, Bette Midler, reality star, Kim Kardashian, nude photo, Chloë Grace Moretz, Kanye West, entertainment, BeastStyle, BeastStyle-Celebrity

Two more nude selfies from Kim Kardashian West earn dissing tweets from Bette Midler and Chloë Grace Moretz.

విమర్శకులకు మరో న్యూడ్ ఫోటోతో బదులిచ్చిన కిమ్ కర్దాషియన్‌

Posted: 03/09/2016 11:55 AM IST
Kim kardashian west declares war with her body

హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్‌ కిమ్ కర్దాషియన్‌ తన విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో నగ్న ఫోటోటు పోస్టు చేస్తారా..? అంటూ వచ్చిన విమర్శలపై అమె మరో న్యూడ్ ఫోటోతో బదులిచ్చింది. కిమ్‌ నగ్నంగా దిగిన సెల్ఫీని ట్విట్టర్‌లో షేర్ చేయడంపై దుమారం రేగగా, ఆమె తీరును సోషల్ మీడియాలో పలువురు తప్పుబట్టారు. నగ్నంగా దేహాన్ని చూపిస్తూ ఆమె క్రేజ్‌ తెచ్చుకోవాలని భావిస్తున్నట్టు సెలబ్రిటీలైన బెట్‌ మిడ్లర్, క్లోహి మోరెట్జ్, పీర్స్ మోర్గాన్ తదితరులు విమర్శించారు.

ఈ విమర్శలకు సమాధానంగా కిమ్‌ కర్దాషియన్‌ మరో న్యూడ్ ఫొటోను ట్విట్టర్‌లో పెట్టింది. దీనికి 'లిబరేటెడ్‌' (విముక్తి) అని అనే హ్యాష్‌ట్యాగ్‌ జోడించింది. సరిగ్గా ప్రపంచ మహిళా దినోత్సవం రోజునే ఈ పోస్టును చేసిన కిమ్.. తన విమర్శకుల నోటికి మరింత పనిపెట్టాలని భావించింది. 35 ఏళ్ల కిమ్‌ కర్దాషియన్ ఈ ఫొటోలో బ్లాక్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో తన అందాలను క్లాసికల్‌గా చూపించింది. తన ఛాతి, ప్రైవేటు అంగాలు కనిపించకుండా రెండు చేతులు అడ్డుపెట్టుకొని దిగిన ఈ ఫొటోను తన విమర్శకులకు సమాధానంగా పోస్టు చేసింది.

తనపై విమర్శలు చేసిన క్లోహి మోరెట్జ్‌, బెట్‌ మిడ్లర్‌పై ఘాటుగా విరుచుకుపడుతూ వ్యాఖ్యలు చేసింది. టీన్‌ స్టార్‌ క్లోహి మోరెట్జ్‌ కిమ్‌ తీరును ట్విట్టర్‌లో ఏకిపారేసింది. యువతులు గొప్ప లక్ష్యాలు నిర్దేశించుకునేలా మార్గనిర్దేశం చేయాల్సిన అవసరముందని, ఈ విషయాలేవీ చెప్పకుండా అస్తమానం దేహాన్ని ప్రదర్శించడం అంత మంచిది కాదని కిమ్‌కు హితవు పలికింది. సెలబ్రిటీ స్టేటస్‌కు ఎంత గౌరవముంటుందని, దానిని ఇలా బజారుకీడ్చడం సరికాదని, తాను ఇలాంటి పనులు ఎప్పటికీ చేయబోనని 19 ఏళ్ల  క్లోహి స్పష్టం చేసింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Twitter battle  Oscar nominee  Bette Midler  reality star  Kim Kardashian  nude photo  

Other Articles