Two more TD MLAs to join TRS day after, only three left now

Two more td mlas to join trs day after only three left now

TDP, telugudesamparty, TRS, Magunta Gopinath, Arekapudi Gandhi, Chandrababu Naidu

In continuation to the joining spree, the Telangana Telugu Desam Party city president Maganti Gopinath Choudary and MLA Arekepudi Gandhi are all set to join ruling TRS party this time. A confirmation to this effect was understood to have arrived after the duo met the Chief Minister Chandrasekhar Rao at his residence tonight at 7.30 pm after his arrival from Mumbai tour.

టిఆర్ఎస్ లోకి మాగుంట, అరెకపూడి గాంధీ...?

Posted: 03/09/2016 07:18 AM IST
Two more td mlas to join trs day after only three left now

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లినట్లు కనిపిస్తున్నాయి. పార్టీకి చెందిన చాలా మంది నాయకులు, క్యాడర్ సైకిల్ దిగి.. కారెక్కాయి. అయితే తాజాగా మరో ఇద్దరు ముఖ్య నాయకులు కూడా పార్టీ మారనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈనెల 11వ తేదీన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాత్రి తిరిగి వచ్చాక దాదాపు ఏడున్నర గంటల సమయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయనను కలసి చర్చించారు. తమ చేరికకు గ్రీన్‌సిగ్నల్ తీసుకుని... ఇందుకు 11వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నారని తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ సమక్షంలో వీరిద్దరూ టీఆర్‌ఎస్‌లో చేరనున్నాట్లు దాదాపు ఖరారైంది. అయితే మాగంటి గోపీనాథ్ సోమవారం ఉదయమే సీఎం కేసీఆర్‌ను కలసి తమ చేరిక గురించి చర్చించారు. నిన్న అరికెపూడి గాంధీతో కలసి మరోసారి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలూ పార్టీ మారితే.. ఇక తెలంగాణ టీడీపీకి మిగిలేది ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కావడం గమనార్హం. కాగా, టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌లో చేర్చాలంటూ స్పీకర్‌కు లేఖ ఇచ్చిన ఎర్రబెల్లికి మాగంటి, అరికెపూడి మద్దతు తెలిపారని సమాచారం. విలీనానికి తాము కూడా అంగీకారం తెలుపుతున్నామని రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మరి తెలుగుదేశం పార్టీ నుండి వలసలను చంద్రబాబు నాయుడు ఏవిధంగా అడ్డుకుంటారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  telugudesamparty  TRS  Magunta Gopinath  Arekapudi Gandhi  Chandrababu Naidu  

Other Articles