Boy sexually abused by woman warden in puducherry

Boy sexually abused by woman warden

14-year old boy sexual abuse, boy sexually abused by woman warden, sexual harassment on 14 yrs boy, private Children's Home, Kirumampakkam, sexual abuse in children's home, sexual abuse in kirimampakkam, Kirumampakkam police station, Protection of Children from Sexual Offences Act, woman warden sexual abuse, Child Welfare Committee, home director

A 14-year old boy is reported to have been sexually abused by a woman warden at a private Children's Home in Kirumampakkam here for almost a year.

14 ఏళ్ల బాలుడితో ఏడాదిగా కామవాంఛ తీర్చుకుంటున్న వార్డెన్..

Posted: 03/05/2016 04:26 PM IST
Boy sexually abused by woman warden

పాండిచ్చేరి నగరంలోని కిరుమంబాక్కం ప్రాంతంలో ఓ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు ఏడాది కాలంగా బాలుడు లైంగిక వేదింపులకు గురవుతున్నా.. ఎవరికీ చెప్పకోలేక తనలో తానే మదనపడుతున్నాడు. ఎక్కడో దక్షిణాఫ్రికాలో యువకులను కిడ్నాప్ చేసి.. వారిపై అత్యాచారానికి యత్నించి.. వారి నుండి వీర్యాని సేకరించే ముఠాలు వున్నాయి. కానీ మన దేశంలో తన బిడ్డలాంటి ఓ బాలుడితో ఎ మహిళా వార్డెన్ దారుణానికి పాల్పడిన ఘటన బహిర్గతం కావడంతో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే... 2004లో సంభవించిన సునామీ ప్రళయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు అధిక సంఖ్యలో ఈ స్వచ్చంద సంస్థలో నివశిస్తున్నారు. కిరుమంబాక్కం లో ఉన్న ఒక ప్రైవేటు స్వచ్చంద సంస్థలో నివసించే ఒక యువకుడిని సదరు స్వచ్చంద సంస్థను వదలి గతంలోనే రెండు పర్యాయాలు పారిపోయాడు. మూడవ సారి కూడా అలాగే చేసి మళ్లో దోరికిపోయాడు. మూడు సార్లు తన పిల్లల సంరక్షణ కేంద్రం నుంచి ఓ బాలుడు పారిపోవడం విషయం తెలిసిన సదరు చైల్డ్ కేర్ ఇస్టిట్యూట్ డైరెక్టర్ ఆ బాలుడిని పిలిచి అసలు విషయం ఏమిటని అడిగాడు.

అసలు బయటకు వెళ్లిన వాడికి ఆశ్రమానికి రావడానికి ఎందుకు ఇష్టపడటం లేదని ప్రశ్నించాడు. తాను ఎవరికీ చెప్పనని, నీకు ఎలాంటి హాని జరగదని హామీ ఇచ్చాడు. దాంతో బాలుడు తనపై లేడీ వార్డన్ లైంగికంగా వేధింపులకు గురిచేస్తుందని చెప్పాడు. గత ఏడాదిగా తనను లైంగిక వేధింపులకు గురిచేస్తుందని, అది భరించలేక గతంలో తాను రెండు పర్యాయాలు సంస్థను వదిలి వెళ్లానని, అయితే మళ్లీ సిబ్బంది తనను పట్టుకువచ్చారని చెప్పాడు, దీంతో లేడి వార్డన్ పై పోలీసులకు పిర్యాదు చేసిన డైరెక్టర్ అమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరగా, పోలీసులు అమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడ్ని అస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : home director  child care institute  woman warden  sexuall abuse  Kirumampakkam  puducherry  

Other Articles