Undavalli wages legal war against Ramoji Rao

Ramoji s padma award in leagal soup

Ramaoji Rao, Undavalli Arun Kumar, YSR, Padma Awards, central government, margadarsi chit funds, margadarsi finance, cheating, high court, clean chit in Margadarsi chit fund, YS Rajasekhar Reddy, Eenadu Group Chairman

Former Congress MP Undavalli Arun Kumar filed a PIL in Hyderabad High Court questioning the Central Government on what grounds it honoured Media Baron Ramoji Rao with Padma Vibhushan award. Union Home Secretary, Chief Secretaries of Telugu States

రామోజీ పద్మ పురస్కారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఉండవల్లి

Posted: 03/03/2016 07:25 PM IST
Ramoji s padma award in leagal soup

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై కాంగ్రెస్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ న్యాయపోరాటాన్ని సంధించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరిట ఆయన సంస్థ చేసిన వసూళ్లు నిబంధనలకు విరుద్దమని అరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన ఉండవల్లి మళ్లీ ఆయనపై ఎలా న్యాయపోరాటం చేస్తున్నారు అనేగా మీ సందేహం. మార్గదర్శి పేరున ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని గతంలో ఏళ్ల తరబడి న్యాయ పోరాటం సాగించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో మార్గదర్శి ఫైనాన్స్ అక్రమ వసూళ్లు చేస్తుందని ఆయన ఆరోపించి కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు ప్రస్తుతం విచారణలో వుంది.

తాజాగా ఉండవల్లి మరోమారు రామోజీరావును కోర్టుకు ఈడ్చేందుకు రంగంలోకి దిగారు. ఈ దఫా ‘పద్మ విభూషణ అవార్డు’ను ఆసరా చేసుకున్న ఆయన ఏకంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. మార్గదర్శి కేసులో క్లీన్ చిట్ రాకుండానే రామోజీరావుకు పద్మ విభూషణ్ అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ఉండవల్లి ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు, వ్యక్తిగత హోదాలో రామోజీరావును ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramaoji Rao  Undavalli Arun Kumar  YSR  Padma Awards  

Other Articles