Rahul Gandhi spoke about Fair and Lovely Yojana

Rahul gandhi spoke about fair and lovely yojana

Rahul Gandhi, Modi, fair and lovely Yojana, Parliament

Congress Vice President Rahul Gandhi taunted Prime Minister Narendra Modi asking him to listen to others' opinion as well. Attacking Modi, Rahul said, "The Prime Minister cannot run country only on his opinions. The country is not PM and Pm is not the country." Attacking the Prime Minister on issues ranging from black money, price rise, JNU row, Rohith Vemula suicide, Naga accord to 26/11 Mumbai attacks operations and his visit to Pakistan. He concluded the speech by saying, "Listen to us across the aisle-we are not your enemies."

మోదీ గారి ఫెయిర్ అండ్ లవ్లీ యోజన

Posted: 03/03/2016 09:34 AM IST
Rahul gandhi spoke about fair and lovely yojana

ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీకి చురకలు అంటించారు.  నల్లధనం పైన పథకం ఫెయిర్ అండ్ లవ్లీగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు నల్లధనం గురించి గొప్పగా చెప్పిన ప్రధాని మోడీ... ఆ పథకం ఫెయిర్ అండ్ లవ్లీలా ఉందన్నారు. దీని ద్వారా ఎవరైనా తమ నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవచ్చన్నారు. నల్లధనం ఉన్న వారు ఎవరూ జైలుకు వెళ్లవలసిన అవసరం లేదని, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దగ్గరకు ఎవరైనా వస్తే ఆయనే నల్లధనాన్ని తెల్లధనంగా మారుస్తారన్నారు.

అదే విధంగా డిల్లీ జెఎన్ యూ గురించి మాట్లాడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, విలేకరులను చితక్కొట్టాలని మీ ధర్మంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. దేశానికి వ్యతిరేకంగా కన్నయ్య కుమార్ ఒక్క మాట మాట్లాడలేదన్నారు. పటియాలా హౌస్ కోర్టు వద్ద దాడి ఘటన పైన ప్రధాని మోడీ మాటమాత్రం మాట్లాడలేదన్నారు. నాగా ఒప్పందంపై ముఖ్యమంత్రులను ఎందుకు సంప్రదించలేదన్నారు. సభలో ఎలాంటి గందరగోళం జరిగినా ప్రధాని మోడీ ఎందుకు సైలెంటుగా ఉంటారన్నారు రాహుల్ గాంధీ. ఆయన ఎవరి మాటను వింటారో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రజలు ఏం మాట్లాడినా ప్రధాని మౌనంగా ఉంటారని, ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా మౌనంగా ఉంటారని, మరి ఆయన ఎవరికి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.ప్రధానికి ఇతరులపై గౌరవం లేని పక్షంలో కనీసం ఆ పార్టీలోని సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి సీనియర్ల మాటలైనా వినాలని, లేదంటే జైట్లీ, సుష్మా స్వరాజ్ వంటి వారి మాటలైనా వినాలని రాహుల్ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Modi  fair and lovely Yojana  Parliament  

Other Articles