balakrishna is a real life Legend

Balakrishna is a real life legend

Nandamuri Balakrishna, NBK, Hindupur, Hindupur People, Lepakshi, Lepakshi Ustavam, NBK Fans, Balakrishna

Nandamuri balakrishna always thinks about people. He is a real Hero for Hindupur People.

బాలకృష్ణ రియల్ లైఫ్ లెజెండ్ ఎందుకంటే..?

Posted: 03/02/2016 04:33 PM IST
Balakrishna is a real life legend

ఎన్టీఆర్ కొడుకుగా బాలకృష్ణకు జన్మత: గుర్తింపు లభించింది. తర్వాత ఆయన సినిమాల్లో నటించడంతో సినిమా స్టార్ గా ఎనలేని గుర్తింపు వచ్చింది. స్టార్ హీరోగా ఎంతో పేరున్న బాలకృష్ణ అభిమానులను ఎన్నడూ నిరుత్సాహపరచలేదు. కొన్ని లక్షణాలు పుట్టుకు నుండే రావాలని అంటారు పెద్దలు .. అలా తండ్రి ఎన్టీఆర్ నుండి బాలకృష్ణకు అలాంటి గొప్ప లక్షణాలే వచ్చాయి. అభిమానుల కోసం తాను ఎక్కడికైనా రావడానికి సిద్దంగా ఉంటారు. అందకే ఆయనకు అభిమానులు గుండెల్లో గుడి కట్టారు. అభిమానుల కోసం మంచి సినిమాలు తీయడానికి బాలకృష్ణ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.

ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎలా అయితే ఏకఛక్రాధిపత్యం చేశారో... రాజకీయాల్లో కూడా అలానే నిలిచారు. అదే బాటలో నందమూరి బాలకృష్ణ కూడా దూసుకుపోతున్నారు. కరువు .జిల్లాగా పేరున్న అనంతపురం జిల్లా హిందుపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు బాలకృష్ణ. నందమూరి నటసింహం అనే బిరుదు సొంతం చేసుకున్న బాలకృష్ణ తన ప్రజలకు సేవ చెయ్యడానికి తపిస్తుంటారు. అందుకే హిందుపురం నియోజక వర్గం అభివృద్దికి కృషి చేస్తున్నారు. నియోజక వర్గ అభివృద్దికి ఏపి సిఎం చంద్రబాబు నాయుడుతోనే కాదు, కేంద్ర మంత్రులతో కూడా ఆయన చర్చించారు.

అనంతపురంలోని లేపాక్షి క్షేత్రం గురించి తెలుగు రాష్ట్రాలకు తెలియన వాళ్లు ఉండరు. లేపాక్షి వైభవాన్ని మరోసారి నలువైపుల చాటేలా.. అదే సమయంలో హిందుపురం వైపు దేశం దృష్టిని ఆకర్షించేలా లేపాక్షి ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించారు. నిజానికి ఏపిలో రాష్ట్రం తీవ్ర నిధుల కొరతతో బాధపడుతోంది కానీ బాలకృష్ణ మాత్రం వాటిని కాదని లేపాక్షి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఒప్పించగలిగారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్వయంగా తానే ఆహ్వానం పలికారు.. లేపాక్షి ఉత్సవాల్లో పాల్గొని వాటిని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.

ఇక లేపాక్షి ఉత్సవాల బరువు, బాధ్యతలను నందమూరి బాలకృష్ణ ఒంటిరిగా నిర్వహించారు. లేపాక్షి ఉత్సవాల ఏర్పాట్ల దగ్గరి నుండి ఉత్సవాల్లో ప్రజలను అలరించడం వరకు అన్నింటా బాలకృష్ణ తన మార్క్ వేశారు. సినిమా రంగం నుండి వచ్చాడు కాబట్టి ప్రజలకు సినిమా తరహాలో ఎంటర్ టెన్ మెంట్ అందించారు. లేపాక్షి ఉత్సవాలకు హాజరైన వారి కోసం బాలకృష్ణ సినిమా డైలాగులు చెప్పారు. అంతే కాకుండా సినిమా పాటలు కూడా పాడారు. ఇక లేపాక్షి ఉత్సవాలతో లేపాక్షికి కొత్త కీర్తి ప్రతిష్టలను అందించేందుకు కృషి చేశారు.

హిందుపురం ప్రజలకు సినిమా వల్ల అందుబాటులో లేకున్నా కానీ వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తారు. కలెక్టరేట్ లో ప్రజల నుండి స్వయంగా వినతులు తీసుకొని.. వారికి పరిష్కాలకు కృషి చేశారు. హిందుపురం వాసుల ఇబ్బందులకు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వారి ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేస్తున్నారు. ప్రజలు తనను నాయకుడిగా ఎన్నుకోవడం ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని అందించారు అని బాలకృష్ణ అంటారు. ప్రజలకు సేవ చేయడానికి నిర్మలమైన మనస్సు ఉంటే చాలు.. అని నిరూపిస్తున్నారు. సినిమాల్లో బాలకృష్ణ చెప్పే డైలాగులు అందరికి తెలుసు.. కానీ రియల్ లైఫ్ లో మాత్రం నందమూరి బాలకృష్ణ అంటే మాటలు కాదు.. చేతలు అని నిరూపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Balakrishna  NBK  Hindupur  Hindupur People  Lepakshi  Lepakshi Ustavam  NBK Fans  Balakrishna  

Other Articles