Now get into a chopper and enjoy Hyderabad's aerial view

Hyderabad streets arieal view from the sky in chopper

hot air balloons ride, Hyderabadis enjoy helicopter ride, bird's eye view, historic hyderabad city, helicopter ride, minister K T Rama Rao, KTR, chopper rides, Necklace Road, Hyderabad Aerial trip, Heli Tourism in Hyderabad, Indwell Aviation Private Limited, chopper ride cost Rs 3,500 per person, Nagarjuna Sagar, Warangal, Karimnagar, Nallamalla forest, Godavari river.

After the joyous ride of hot air balloons in December, Hyderabadis will now be able to enjoy helicopter rides to have a bird's eye view of the historic city.

గగనతలం నుంచి హైదరాబాద్ నగర అందాలు.. మీరూ చూస్తారా..?

Posted: 03/01/2016 01:11 PM IST
Hyderabad streets arieal view from the sky in chopper

అంతెత్తున ఠీవిగా నిలిచిన చార్మినార్.. గొప్ప కోటల్లో ఒకటిగా ఖ్యాతి పొందిన గోల్కొండ.. మానవ నిర్మిత పెద్ద జలాశయాల జాబితాలో మనకూ చోటు కల్పించిన హుస్సేన్‌సాగర్.. పాలరాతి అద్భుతం బిర్లా మందిర్.. చారిత్రక ఖ్యాతితోపాటు ఆధునిక హంగులద్దుకున్న భాగ్యనగరం.. ఇందులో ఏదీ మనకు కొత్తకాదు.. కానీ గగనతలం నుంచి వీటిని వీక్షిస్తే.. రోజూ చూసే నగరం కూడా కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడా అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలి టూరిజం జాయ్ రైడ్స్ ప్రాజెక్టును హైదరాబాదీయులకు కూడా అందించనుంది. హైదరాబాద్ ఏరియల్ ట్రిప్‌ను జాలీగా హెలికాప్టర్ లో గగనతలం నుంచి వీక్షించే అవకాశం లభించింది.

దీనిని ఇవాళ రాష్ట్ర పర్యాటక, ఐటీ, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కేటీఆర్ నెక్లస్ రోడ్డులో లాంఛనంగా ప్రారంభించారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇండ్‌వెల్ ఏవియేషన్ ప్రైవే ట్ లిమిటెడ్‌తో కలసి పర్యాటక శాఖ ‘హెలి టూరిజం ఇన్ హైదరాబాద్’ను నిర్వహిస్తోంది. 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు ఉండే జాయ్ రైడ్‌కు రూ.3500గా టికెట్ ధర నిర్ణయించారు. దీనికి స్పందన లభిస్తే ట్రిప్పు నిడివి పెంచుతూ నగర సమీపంలోని ఇతర ప్రాంతాల వరకు విస్తరించాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్, వరంగల్, కరీంనగర్, నల్లమల అడవి, కృష్ణా, గోదావరి నదీ ప్రాంతాలు తదితరాలతో దీన్ని అనుసంధానించాలని భావిస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Minister KTR  Helicopter rides  Tourist Department  

Other Articles