FIR in Telangana against Rahul Gandhi, Arvind Kejriwal for sedition

Rahul kejriwal yechury among 9 booked

sedition case, Rahul Gandhi, JNU, Arvind Kejriwal, Ajay Maken, Afzal Guru, sitaram yechury, Telangana, saroornagar police station, advvocate janardhan goud, five other national leaders, Cyberabad police commissionerate, Ranga Reddy district, Telangana

Congress vice-president Rahul Gandhi, Delhi chief minister Arvind Kejriwal and five other national leaders have been accused of sedition in an FIR filed at the Saroornagar police station under the Cyberabad police commissionerate, in Ranga Reddy district of Telangana.

రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, ఏచూరి, రాజా సహా 9 మంది తెలంగాణలో కేసు

Posted: 02/29/2016 03:57 PM IST
Rahul kejriwal yechury among 9 booked

కాంగ్రెస్ యువనేత, ఏఐసిసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి, సీపిఐ రాజ్యసభ సభ్యుడు డి. రాజా సహా 9 మంది జాతీయ నేతలపై దేశద్రోహం కింద తెలంగాణలో కేసు నమోదయ్యాయి. హైదరాబాదులోని  సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు కేసు నమోదైంది. ఉగ్రవాదులకు మద్దతిస్తున్నారని వారిపై హైదరాబాదుకు చెందిన న్యాయవాది జనార్దన్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు ఆదేశాలతో సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
 
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విద్యార్థులు కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్ లకు మద్దతుగా రాహుల్, కేజ్రీలు వర్సిటీల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఉగ్రవాదులకు మద్దతిచ్చారని గౌడ్ తన పిటిషన్ లో కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన 11వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పిటిషనర్ వాదన సరైందేనని అభిప్రాయపడింది. అంతేకాక రాహుల్, కేజ్రీలతో పాటు సీపీఐ నేత డి.రాజా సహా మరో ఆరుగురిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సరూర్ నగర్ పోలీసులు రాహుల్, కేజ్రీ, రాజాలపై కేసులు నమోదు చేశారు.`

కాగా, దీనిపై స్పందించిన అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కన్నా తానే పెద్ద దేశ భక్తుడినని పేర్కోన్నారు. మిత్రపక్షమైన పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీకి కోపం తెప్పించొద్దనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం జెఎన్ యూ వివాదంలో అసలైన దేశద్రోహులను అరెస్టు చేయడం లేదని కేజ్రీవాల్ మండిపడ్డారు. 'దేశద్రోహం అభియోగాలతో నాపై కేసు పెట్టారు. దళితులు, వెనుకబడిన తరగతులు, పేదల కోసం నేను గళమెత్తుతున్నాను. అందుకే (బీజేపీ) వాళ్లకు నేను దేశద్రోహిలాగా కనిపిస్తున్నాను. అయినా నా గొంతును ఎవ్వరూ అణచివేయలేరు.

వారి కోసం నేను నా పోరాటాన్ని కొనసాగిస్తాను' అని కేజ్రీవాల్ సోమవారం ట్విట్టర్ లో పేర్కొన్నారు. 'మోదీజీ కన్నా నేనే పెద్ద దేశభక్తుణ్ని. దేశాన్ని నాశనం చేస్తామంటూ నినాదాలు చేసిన వారిని ఎందుకు ఇంకా అరెస్టు చేయలేదని నేను ప్రశ్నించాను. ఎందుకంటే ఆ నినాదాలు చేసిన కశ్మీరీలు. వారిని అరెస్టుచేస్తే మెహబూబా ముఫ్తీకి కోపం వస్తుంది. అందుకే అరెస్టు చేయడం లేదు. సరిహద్దుల్లో ప్రతిరోజూ సైనికులు అమరులవుతున్నారు. మోదీ మాత్రం కశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటు కోసం దేశద్రోహులను కాపాడాలని చూస్తున్నారు' అని కేజ్రీవాల్ ట్విట్టర్ లో ధ్వజమెత్తారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sedition case  Rahul Gandhi  JNU  Arvind Kejriwal  Ajay Maken  Afzal Guru  adovocate  

Other Articles