Finance Minister Arun Jaitley Spells Out 9 Pillars For Transforming India

Finance minister arun jaitley spells out 9 pillars for transforming india

Union Budget, BUdget, Arun Jaitly, Modi, Budget 2016

inance Minister Arun Jaitley today specified "nine pillars" for India, which will be focus areas for the government. "The agenda for next year is to undertake transformative measures based on 9 pillars for India," Mr Jaitley said in his third Budget speech.

9 లక్ష్యాలతో కేంద్ర బడ్జెట్ 2016

Posted: 02/29/2016 01:36 PM IST
Finance minister arun jaitley spells out 9 pillars for transforming india

నవభారత నిర్మాణానికి నవ మార్గాలే తమ ప్రభుత్వ ఎజెండా అని అరుణ్ జైట్లీ చెప్పారు. రైతు సంక్షేమం నుంచి పన్ను సంస్కరణల వరకు 9 లక్ష్యాలను వివరించారు. రైతుల కోసం జాతీయ స్థాయి ఇ ప్లాట్ ఫాం వ్యవస్థను డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న జాతికి అంకితం చేస్తామని అరుణ్ జైట్లీ తెలిపారు. వీటి ద్వారా 97 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను దాచుకోవచ్చని చెప్పారు. నాబార్డ్ ద్వారా దీర్ఘకాలిక ఇరిగేషన్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీనికి ప్రాథమికంగా 20 వేల కోట్లు కేటాయించారు. గ్రౌండ్ వాటర్ మేనేజిమెంట్ కోసం 60 వేల కోట్లు కేటాయించారు.

ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్‌లో రూ.38,500 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే రూ. 4 వేల కోట్లు అదనంగా కేటాయించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భూగర్భ జలాల పెంపునకు రూ.60 వేల కోట్లు. గ్రామీణాభివృద్ధికి రూ. 87,765 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో పాలు, తదితర వాటి కోసం ఈ-మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. గ్రామీణ, మున్సిపాల్టీల అభివృద్ధికి బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేశారు. రూ. 2.87లక్షల కోట్లు, అంటే గతంతో పోల్చుకుంటే 228 శాతం అధికంగా కేటాయించారు. గ్రామాల్లో సదుపాయల కల్పనకు పెద్ద పీట వెళారు. గ్రామీణ విద్యుదీకరణకు సంబంధించిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకానికి రూ. 38,500 కోట్లు కేటాయించారు.  గ్రామాల్లో డిజిటల్‌ విద్యావ్యాప్తి వచ్చే మూడేళ్లలో 6కోట్ల గృహాలను డిజిటల్‌ లిట్రసీ స్కీం పరిధిలోకి తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Union Budget  BUdget  Arun Jaitly  Modi  Budget 2016  

Other Articles