ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్లో ఘనంగా జరుగుతోంది. ఆస్కార్ రెడ్‌కార్పెట్‌పై హాలీవుడ్ భామలు ధగధగలాడారు. ఫ్యాషన్ గౌనులతో కిక్కెక్కించారు. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఆస్కార్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. క్వాంటికో సీరియల్‌తో అమెరికా ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియాంక ఈ ఏడాది ఆస్కార్స్‌లో అవార్డును కూడా ప్రజెంట్ చేయనుంది. వైట్ క్రీమ్ గౌన్‌లో వచ్చిన బాలీవుడ్ బ్యూటీ రెడ్‌కార్పెట్ అతిథులను తన అందాలతో స్టన్ చేసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరుగుతున్న 88వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం కోసం తారలంతా తరలివచ్చారు
88వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉత్తమ సహాయనటిగా అలీషియా వికందర్(ద డానిష్ గర్ల్) ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో స్పాట్లైట్ చిత్రం అకాడమీ అవార్డుకు ఎంపిక కాగా, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జెన్నీ బెవన్(మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్), ఉత్తమ ప్రొడక్షన్‌గా కొలిన్ బిగ్సన్(మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీరోడ్) ఉత్తమ మేకప్, కేశాలంకరణ విభాగంలో లెస్లే వాండర్‌వాల్ట్, ఎల్కా వార్డెగా(మ్యాడ్‌మ్యాక్: ఫ్యూరీ రోడ్), ఉత్తమ ఛాయాగ్రహణం కేటగిరీలో ఎమ్మాన్యుయెల్ లుబెజ్కి(ది రెవెనెంట్), ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో మార్గరెడ్ సిజెల్( మ్యాడ్ మ్యాక్: ప్యూరీ రోడ్)లకు అవార్డులు దక్కాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more