naked man falls from three storey building after escaping his lover's husband by climbing out the window

Naked man falls from building after caught cheating

china, boy friend, husband, Valentine's Day, naked chinese man, naked man falls from third-storey building, lover escaping lover's husband, lover escape,

This is the shocking moment a naked man climbed out of a window and down a drainpipe after being caught with another man's wife

ITEMVIDEOS: అక్రమ సంబంధం తెచ్చిన తంట.. నడివీధిలో నూలుపోగు లేకుండా..

Posted: 02/26/2016 08:12 PM IST
Naked man falls from building after caught cheating

అక్రమ సంబంధం ప్రపంచ వ్యాప్తంగా ఎందరెందరో ప్రాణాలను హరించింది. ఇక్కడ అక్కడ, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం, ఈ దేశం, ఆ దేశం అన్న వత్యాసాలు లేకుండా అన్ని చోట్లా తన ప్రతాపాన్ని చూటుతూ అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇందులో మహిళలు, పురుషులు కూడా వున్నారు. తాజాగా ఇదే అక్రమ సంబంధం అతడి ప్రాణం మీదకు తెచ్చింది. చావు తప్పి కన్ను లోట్టపోయిన చందంగా మారింది. ఈ ఘటన చైనాలో జరిగింది. ప్రియురాలి భర్త కంట పడకుండా తప్పించుకునేందుకు అతడు పడిన పాట్లు ఎలా వున్నాయో మీరే చదవండీ..

ఆమె అతడికి మాజీ ప్రేయసి. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటోంది. కానీ, మాజీ ప్రేమికుడితో మాత్రం బంధాన్ని తెంచుకోలేదు. భర్త ఇంట్లో లేని ప్రతిసారి ప్రియుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తోంది. కానీ, అనుకోకుండా ప్రేమికుల రోజు వారి పాలిట శాపంగా మారింది. ఆ రోజు భర్త లేని సమయంలో ప్రియుడితో కలిసి ఏకాంతంగా గడుపుతుండగా అనూహ్యంగా భర్త రావడంతో వారిద్దరి గుండెలు ఆగిపోయాయి. అప్పటికే ఒంటిపై నూలుపోగు కూడా లేని ఆ ప్రేమికుడు ఆమె భర్త నుంచి తప్పించుకొని మూడో అంతస్తులోని ఫ్లాట్కు ఉన్న కిటికీలో నుంచి బయటపడేందుకు ప్రయత్నించాడు.

తన పరువు విషయం పక్కన పెట్టి నగ్నంగానే పైపు పట్టుకొని మెల్లగా కిందికి దిగడం ప్రారంభించాడు. కానీ దురదృష్టవశాత్తు పట్టుకోల్పోయి అక్కడి నుంచి కిందపడ్డాడు. దాంతో అప్పటికే అతడి బాగోతం మొత్తాన్ని నోరెళ్లబెట్టి వీడియోలు తీస్తున్న వారు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో అతడు గాయాలతో బతికి బట్టకట్టాడు. ఈ వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టగా ఇప్పుడది సంచలనం సృష్టిస్తోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  boy friend  husband  Valentine's Day  

Other Articles