LeTV Le 1s | LeTV Le Max | out of stock | open sale | LeEco fans angry | flip kart | netgens

Letv le 1s out of stock within minutes of open sale leeco fans angry

LeTV Le 1s, LeEco, open sale, Le Max, LeTV Le 1s, LeTV Le Max, out of stock, open sale, LeEco fans angry, flip kart, netgens

stocks of LeEco’s first ‘open sale’ ran out within minutes, with many so-called ‘super fans’ turning into ‘super angry fans’.

ఆన్ లైన్ అమ్మకాలు.. ‘అవుట్ ఆఫ్ స్టాక్’పై నెట్ జనుల మండిపాటు

Posted: 02/26/2016 03:15 PM IST
Letv le 1s out of stock within minutes of open sale leeco fans angry

భారత్ లాంటి సంప్రదాయ దేశాల్లో ఈ కామెర్స్ వ్యాపారసంస్థలను నియంత్రించాలని లేని పక్షంలో సంప్రదాయానికి విఘాతం కలిగే అవకాశాలు అధికంగా వుంటాయని పలువరు విశ్లేషకులు అభిప్రాయపడినా.. ఇండియన్ మార్కెట్ ను అసరాగా చేసుకుని వస్తున్న ఈ కామర్స్ సైట్లు మాత్రం తమ వ్యాపారాలను మూడు వువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా దినదినాభివృద్ది చేసుకుంటున్నాయి. అధునాతనమైన వస్తువులు అందుబాటు ధరలోనే అన్న చిన్న ప్రకటన నెట్ లో కనిపించీ.. కనిపించగానే వాటికి వుండే డిమాండ్ అంతాఇంతా కాదు.

ఈ విషయంలో అన్ని వస్తువుల కన్నా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, స్మార్ట్ ఫోన్లకు వుండే డిమాండ్ చెప్పనలవి కాదు. ఫలనా రోజు బుకింగ్ ప్రారంభిస్తామనగానే వేల చేతులు ఆ నిర్ధిష్ట రోజు నిర్ధిష్ట సమయానికి టక్కున సైట్ కు వెళ్లి తమ వస్తువులను బుక్ చేస్తుంటాయి. ఈ విషయంలో అమ్మకాలు అన్ని అనుకున్న సమయం కన్నా ముందే అయిపోతే.. ఇక నెట్ లో సదరు వస్తువును తూర్పారబడతారు చూడండీ.. కొన్ని కామెంట్లను అసలు చదవడానికి కూడా అయిష్టత కలుగుతుంది.

తాజాగా ఎల్ఈటీవీ 'ఓపెన్ సేల్' స్మార్ట్ ఫోన్ ప్రియులకు అలాంటి అనుభవమే కలిగింది. లె 1ఎస్ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో గురువారం ఓపెన్ సేల్ కు పెట్టింది. హైఎండ్ ఫీచర్లతో అందుబాటు ధరలో లభ్యమవుతున్న ఈ ఫోన్ తమ దక్కించుకునేందుకు ప్రయత్నించిన వినియోగదారులకు ఆశాభంగం ఎదురైంది. అమ్మకానికి పెట్టిన కొద్ది నిమిషాల్లోనే ఫోన్లు అన్నీ అమ్ముడయ్యాయన్న మెసేజ్ దర్శనమివ్వడంతో స్మార్ట్ ఫోన్ అభిమానులు అవాక్కయ్యారు.

అవుట్ అప్ స్టాక్ సందేశంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఫోన్లు అమ్ముతామో చెప్పకుండా తమను పూల్స్ చేసిందని వాపోయారు. మొదటి ఫ్లాష్ అమ్మకాల్లో 2.2 లక్షల ఫోన్లు విక్రయించడంతో ఓపెన్ సేల్ లో కనీసం 2 లక్షల ఫోన్లు అమ్మకానికి పెడుతుందని భావించారు. స్టాక్ లేనప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం ఎందుకు చేశారని ఓ వినియోగదారుడు ప్రశ్నించాడు. ఎల్ఈటీవీ తమను డిసప్పాయింట్ చేసిందని పేర్కొన్నారు. ఫ్లిప్ కార్ట్ లో లె 1ఎస్ స్మార్ట్ ఫోన్ బుక్ చేశాను కానీ 20 నిమిషాల తర్వాత స్టాక్ అయిపోయినట్టు కనబడింది. ఏం జరుగుతోంది, సేల్స్ సక్రమంగా లేవని మరో అభిమాని వాపోయాడు. స్టాక్ అయిపోయిందంటున్నారు, ఓపెన్ సేల్ కు అర్థముందా అని మరొకరు ప్రశ్నించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LeTV Le 1s  LeEco  open sale  Le Max  LeTV Le 1s  LeTV Le Max  out of stock  open sale  LeEco fans angry  flip kart  netgens  

Other Articles