ISIS reportedly threatens Facebook and Twitter founders

Isis reportedly threatens facebook and twitter founders

facebook, twiter, ISIS, video, Mark Zukenberg, Jack Dorsey

ISIS has issued a threat to Facebook founder Mark Zuckerberg and Twitter founder Jack Dorsey over the companies’ effort to take down terror-affiliated accounts, according to a published report. Vocativ reported Wednesday it had uncovered a 25-minute video allegedly created by ISIS on the instant messaging app Telegram. The video shows a photo of Zuckerberg and Dorsey with bullet holes across their faces.

ట్విట్టర్, ఫేస్ బుక్ వ్యవస్థాపకులకు హెచ్చరిక

Posted: 02/26/2016 09:24 AM IST
Isis reportedly threatens facebook and twitter founders

ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ లను హతమారుస్తామని ఐఎస్‌ఐఎస్ హెచ్చరించింది. సోషల్ మీడియా ఖాతాల్లో ఉగ్రవాద సమాచార నియంత్రణకు ప్రయత్నిస్తున్న వారిద్దరికీ వ్యతిరేకంగా పోరాడతామని ఐఎస్‌ఐఎస్ ప్రకటించింది. ఇద్దరికి వ్యతిరేకంగా ఐఎస్ తాజాగా ఒక వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టింది. వారి ముఖాలపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నట్లు డిజిటల్‌గా రూపొందించిన ఫొటోగ్రాఫ్‌ను వీడియోలో ప్రదర్శించారు. అమెరికాకు మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్న వీరిద్దరికీ ప్రాణహాని తప్పదని 25 నిమిషాల సేపు సాగే ఈ వీడియో క్లిప్పింగ్ స్పష్టం చేసింది.

కాలిఫట్ సామ్రాజ్య సైనికుల వారసులమని ప్రకటించిన ఐఎస్.. ఫ్లేమ్స్ ఆఫ్ సపోర్టర్స్ అనే పేరుతో ఈ వీడియోను విడుదల చేసిందని బ్రిటన్‌లోని ప్రముఖ దినపత్రిక సన్ ఓ వార్తా కథనం ప్రచురించింది. తమ ప్రచారాన్ని నిరోధిస్తామని రోజు ప్రకటిస్తున్న ట్విట్టర్, ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు, వారి మిత్రపక్షం అమెరికాలపై పదిరెట్లు దాడి చేయగల సామర్థ్యం ఉందని వీడియో ముగింపు స్లైడ్‌లో ఇంగ్లిష్‌లో వ్యాఖ్యలు వినిపించాయి. తమకు 10 వేలకు పైగా ఫేస్‌బుక్ ఖాతాలు, 150 ఫేస్‌బుక్ గ్రూప్‌లు, 5000లకు పైగా ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేసే దమ్మున్నదని వీడియోలోని మరో స్లైడ్ పేర్కొన్నది.  కొన్ని వారాల క్రితమే ఉగ్రవాద సమాచారం తొలగింపు ప్రక్రియను చేపట్టిన ట్విట్టర్ ఇప్పటివరకు 1.25 లక్షలకు పైగా ఖాతాలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి మద్దతుపై తమ వైఖరి యథాతథంగా ఉంటుందని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పునరుద్ఘాటించారు. తమకు వ్యతిరేకంగా ట్విట్టర్ వ్యవస్థాపకుడు డోర్సీ యుద్ధం ప్రకటించారని పేర్కొన్న ఐఎస్.. తమ సైనికులు, మద్దతుదారులకు ట్విట్టర్ సిబ్బంది అధికారిక లక్ష్యాలవుతారని హెచ్చరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  twiter  ISIS  video  Mark Zukenberg  Jack Dorsey  

Other Articles