Rahul Gandhi said that They Are Scared

Rahul gandhi said that they are scared

Rahul Gandhi, Smriti Irani, HCU, JNU, Modi, Rohith Vemula, kanaiah kumar

Rahul Gandhi set the tone for the Budget session on Wednesday morning as he arrived in Parliament. He picked combative. "I will speak, but they will not let me speak. Because they are scared of what I will say,' said the Lok Sabha MP and vice president of main opposition party the Congress, attacking the BJP-led government.

మోదీ సర్కార్ కు నేనంటే భయం: రాహుల్ గాంధీ

Posted: 02/24/2016 01:45 PM IST
Rahul gandhi said that they are scared

జేఎన్‌యూ, హెచ్‌సీయూ వివాదాలపై పార్లమెంట్‌లో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. లోకసభలో ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు క్యాంపస్ వివాదాలపై చర్చను మొదలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఆ వివాదాలపై స్పందించేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు రాహుల్ అన్నారు. ఆ అంశాలపై మాట్లాడుతున్నప్పుడు.. బీజేపీ ఎంపీలు తనను అడ్డుకుంటారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంపస్ వివాదాలపై రహస్యాలను బయటపెడుతానన్న ఉద్దేశంతో బీజేపీ సభ్యులు తనను అడ్డుకుంటారనని రాహుల్ ఆరోపించారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్ డి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య మీద, దిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఘటనల మీద తాను మాట్లాడితే ప్రభుత్వం పరువు పోతుందని ఎన్డీయే భావిస్తోందని అందుకే తనను మాట్లాడినివ్వడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. మోదీ సర్కార్ కు తానంటే భయమని అందుకే ఇలా ప్రవర్తిస్తోందని రాహుల్ ధ్వజమెత్తారు. మరోవైపు కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ విపక్షాల తీరుపై మండిపడింది. ఓ విద్యార్థి చావును కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Smriti Irani  HCU  JNU  Modi  Rohith Vemula  kanaiah kumar  

Other Articles