Chiranjeevi said that he dont change his party

Chiranjeevi said that he dont change his party

Chiranjeevi, Congress, Mega Star Chiranjeevi, BJP, AMith Sha, AP BJP

Chiranjeevi said that he dont change his party. Some political leaders said that Chiranjeevi may join into BJP party soon. But Chiranjeevi condemn those gossips

పార్టీ మారే ఆలోచన లేదు: చిరంజీవి

Posted: 02/24/2016 10:30 AM IST
Chiranjeevi said that he dont change his party

మాజీ కేంద్ర మంత్రి, నటుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడతారని... త్వరలోనే బిజెపి పార్టీలో చేరుతారని పుకార్లు షికారు చేశాయి. అయితే దీని మీద చిరంజీవి స్పష్టతనిచ్చారు. తానకు పార్టీ మారే ఆలోచన లేదని వెల్లడించారు. గత కొంత కాలంగా ఏపిలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారడంతో చాలా మంది నాయకులు కాంగ్రెస్ ను వదిలి బిజెపి పార్టీలోకి చేరిపోతున్నారు. కాగా చిరంజీవి కూడా అదే బాటపట్టనున్నారని.. త్వరలోనే కాషాయం కండువా వేసుకోనున్నారని వార్తలు వచ్చాయి.

గత కొంత కాలంగా ఏపిలో పార్టీ బలోపేతానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న బిజెపి పార్టీ కాంగ్రెస్ నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఏపిలో కాలం చెల్లిన తరుణంలో మంచి అవకాశంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాగా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చిరంజీవి కూడా పార్టీ వీడుతున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తన చివరి వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని.. పార్టీ మారుతున్నారన్నది కేవలం పుకారు మాత్రమే అని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Congress  Mega Star Chiranjeevi  BJP  AMith Sha  AP BJP  

Other Articles