Mercer survey says Hyderabad offers best quality of life

Mercer survey says hyderabad offers best quality of life

Hyderabad, Saffe, Mercer survey, India, Chennai, Delhi

Southern India emerged at the top for quality of life and safety in a ranking of cities released by human resources consulting firm Mercer on Tuesday. Hyderabad offered the best quality of life in India, according to Mercer. The joint capital of Telangana and Andhra Pradesh, however, dropped one position from last year’s 138th rank in Mercer’s 2016 Quality of Living rankings because of frequent power disruptions and a heat wave that claimed 1,700 lives.

దేశంలో హైదరాబాదే టాప్

Posted: 02/24/2016 09:41 AM IST
Mercer survey says hyderabad offers best quality of life

హైదరాబాద్ మరో గౌరవాన్ని దక్కించుకుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ విషయంలో భారత్ లో హైదరాబాదే నంబర్ వన్ అంటోంది న్యూయార్క్ బేస్డ్ కన్సల్టింగ్ ఏజెన్సీ మెర్సెర్. ప్రపంచ వ్యాప్తంగా జీవించడానికి అనుకూలంగా ఉన్న నగరాలపై మెర్సెర్ సర్వే చేసింది. ఆయా ప్రాంతాల్లోని రాజకీయ స్థిరత్వం, ప్రజల ఆరోగ్య పరిస్థితులు, కాలుష్య స్థాయి, రవాణా సదుపాయాలు, విద్యా అవకాశాలు, క్రైం రేట్ ఆధారంగా నగరాలకు ర్యాంకులు కేటాయించింది. ఇందులో హైదరాబాద్ 139వ స్థానాన్ని దక్కించుకుంది. వరుసగా రెండో సారి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

వాల్డ్ వైడ్ గా 450 నగరాల్లో అధ్యయనం చేసిన మెర్సెర్ సంస్థ… 230 సిటీలకు ర్యాంకులు ఇస్తూ లిస్ట్ తయారుచేసింది. ఇందులో ఆస్ట్రియా రాజధాని వియన్నా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇక మన దేశం విషయానికొస్తే.. హైదరాబాద్ తర్వాత ఫుణె 144, బెంగళూరు 145, చెన్నై 150, ముంబై 152, కోల్ కతా 160, ఢిల్లీ 161 స్థానాలు దక్కించుకున్నాయి. ఢిల్లీ, ముంబై ల్లో రోజు రోజుకు జనాభా పెరుగుతున్నా కనీస సౌకర్యాలు ఉండటం లేదంటోంది మెర్సెర్. తాగునీటి కష్టాలు, విపరీతమైన కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. భారత్ లోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో పరిస్థితి చాలా బెటర్ గా ఉందని చెబుతోంది.

మెర్సెర్ సర్వేలో సింగపూర్ 26 స్థానాన్ని దక్కించుకుంది. జపాన్ రాజధాని టోక్యో, మలేషియా రాజధాని కౌలాలంపూర్ 84 స్థానాన్ని దక్కించుకున్నాయి. చైనా రాజధాని బీజింగ్ 118 వ ప్లేస్ లో ఉండగా.. శ్రీలంక రాజధాని కొలొంబో 132 వ ప్లేస్ లో నిలిచింది. ఇరాక్ రాజధాని బాగ్ధాద్ ఈ లిస్ట్ లో లాస్ట్ ప్లేస్ తో సరిపెట్టుకుంది. ఇక ఇండియాలో అత్యంత సురక్షిత నగరాల జాబితాలో 113 ర్యాంక్ తో చెన్నై ఫస్ట్ ప్లేస్ లో ఉంది. 121 స్థానంతో హైదరాబాద్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. 123 ర్యాంకుతో బెంగళూరు మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Saffe  Mercer survey  India  Chennai  Delhi  

Other Articles