Telecom minister promises legal action if Ringing Bells fails to deliver

Telecom minister promises legal action if ringing bells fails to deliver

Freedom, Freedom251, RingingBells, RaviShankar Prasad

Telecom minister promises legal action if Ringing Bells fails to deliver. Telecom minister Ravi Shankar Prasad said that the government is monitoring Ringing Bells and will take action if the company fails to deliver on its Rs 251 smartphone.

ఫ్రీడం ఫోన్ల కంపెనీ మీద టెలికాం శాఖ కన్ను

Posted: 02/24/2016 08:41 AM IST
Telecom minister promises legal action if ringing bells fails to deliver

దేశం మొత్తం నివ్వరబోయేలా కేవలం 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని ప్రకటించిన రింగింగ్ బెల్స్ సంస్థ ఓ కన్నేసి ఉంచామని కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్-ఫోన్‌-ను విడుదల చేసిన ఈ కంపెనీ చౌక హ్యాండ్‌-సెట్లను పంపిణీ చేయడంలో విఫలమైతే చర్యలకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ‘వారు పంపిణీ విషయంలో ఎలా సన్నద్ధమయ్యారన్నదానిపై టెలికాం శాఖ వాకబు చేస్తోంది. రూ.251 ధరకు ఫోన్లను అందించగలదా లేదా అని పరిశీలిస్తోంది. వారికి బీఐఎస్‌ సర్టిఫికేట్‌ ఉందా లేదా అన్న విషయాన్ని గమనిస్తామ’ని రవిశంకర్ ప్రసాద్‌ మీడియా ప్రతినిధులకు చెప్పారు. ‘మా శాఖ ఆ కంపెనీపై ఓ కన్నేసి ఉంచింద’ని ఆయన అన్నారు.

కాగా, తయారీ వ్యయం రూ.2,500 అయినప్పటికీ విక్రయాల పరిమాణం, వినూత్న మార్కెటింగ్‌, సుంకాల్లో తగ్గింపులు, ఇ-కామర్స్‌ తదితరాల వల్ల ఆ లోటును పూడ్చుకుంటామని రింగింగ్ బెల్స్ కంపెనీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇన్ని వివాదాలు ఒక పక్కన ముసురుకుంటున్నా కూడా రెండు రోజుల్లో 6 కోట్ల మంది ఇంటర్నెట్‌ ద్వారా ఫ్రీడమ్‌ 251 ఫోన్లను బుక్‌ చేసుకున్నారని రింగింగ్ బెల్స్ సంస్థ వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Freedom  Freedom251  RingingBells  RaviShankar Prasad  

Other Articles