apsrtc announces 20 percent discount on last seats

20 percent discount for apsrtc last seats passingers

apsrtc discount, discount on rtc seats, rtc discount on last seats, rtc announces discount on last seats, 20 percent discount on last seats, apsrtc, rtc last seats passingers, apsrtc, discount, last seats

andhra pradesh state road transport corporation announces 20 percent discount on last seats

ఆ సీట్లలో ప్రయాణం చేస్తున్నారా..? అయితే ఇకపై రాయితీ పోందనున్నారు..!

Posted: 02/22/2016 02:20 PM IST
20 percent discount for apsrtc last seats passingers

ఆర్టీసీకి ఆదా యం, ప్రయాణికులకి ఆధునిక సౌకర్యాలు.. లక్ష్యంగా ఆర్టీసీ లో భారీస్థాయిలో ఆధునీకరణకు, ఆకర్షణీయ చర్యలకు శ్రీకారం చుట్టినట్టు సంస్థ ఎండీ సాంబశివరావు ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో చివరి రెండు వరుసల్లోని 9 సీట్ల పరిధిలో టికెట్‌పై 20 శాతం డిస్కౌంట్‌ ఇవ్వడం సహా.. అనేక వినూత్న ఆలోచనలకు కార్యరూపం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఆ వివరాలను ‘ఆర్టీసీ హౌజ్‌’లోని కాన్ఫరెన్స హాల్‌లో ఆయన విలేకరులకు వెల్లడించారు.

ప్రయాణికులకు మెరుగైన సేవల కల్పన దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకొన్నామని, దానికోసం పలు ప్రణాళికలు రూపొందించామని ఆయన వివరించారు. ‘‘గత ఏడాది రూ. 600 కోట్లుగా ఉన్న నష్టాలను రూ.490 కోట్లకు తగ్గించుకోగలిగాం. నిజానికి, సంస్థకి ఆపరేషనల్‌ లాస్‌ లేదు. సంస్థ చేసిన అప్పులు, వాటికి వడ్డీ చెల్లింపులు, ఇతర వ్యయాల వల్లనే నష్టాలు సంభవిస్తున్నాయి’’ అని వివరించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చర్యలు తీసుకొన్నామని చెప్పారు. ‘‘40 ఏసీ బస్సులను ప్రవేశపెట్టాం. 795 ప్రైవేటు బస్సులకు టెండర్లు పిలిచామని, మరో 45 రోజుల్లో ఈ బస్సులన్నీ అందుబాటులోకి వస్తాయి’’ అని తెలిపారు.
 
*  ప్రయాణికులకు తక్షణ లబ్ధి చేకూర్చే విధానాలతోపాటు...వారి సౌకర్యం, వసతి, వినోదం కోసమూ పలు కార్యక్రమాలను చేపడుతున్నట్టు ఆర్టీసీ ఎండీ వివరించారు.
*  దూర ప్రయాణ బస్సులలో 250 కిలోమీటర్లు ప్రయాణించినవారికి లోకల్‌ బస్సుల్లో 2 గంటలపాటు అదే టికెట్‌పై ఉచిత ప్రయాణం కల్పిస్తారు.
*  గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అడ్వాన్స్‌ బస్‌ అరైవల్‌ సిస్టమ్‌(అభయ్స్‌) అమలు.. బస్‌ స్టాపుల్లో ఫలానా రూటు బస్సు ఎప్పుడు వస్తుందో ముందస్తుగా ప్రకటన.
*  కండక్టర్‌ సెల్‌ఫోన చేయగానే ..బస్టాప్‌లోని మైకు ఆటోమేటిక్‌గా ఆ బస్సు ఎప్పుడు వస్తుందో చెబుతుంది. అనౌన్సమెంట్‌ వస్తోందన్నారు.
*  రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ డివిజన్, టెంపుల్‌ సిటీల పరిధిలో ఉన్న బస్‌స్టేషన్ల ఆధునీకరణ.
*  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 మేజర్‌ బస్‌స్టేషన్లకు రూ.13.18 కోట్ల వ్యయంతో నవీకరణ. ఎలక్ర్టానిక్‌ డిస్‌ప్లే బోర్డులు, టీవీల ఏర్పాటు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : apsrtc  discount  last seats  passengers  

Other Articles