tension in JNU Delhi

Tension in jnu delhi

JNU, JNU University, Delhi, Anti-national slogans, Umar halid

Two days after the Delhi Police issued a lookout notice for five absconding students, who have been named in a sedition case for allegedly shouting anti-national slogans in Jawaharlal Nehru University (JNU), the students returned to the campus on Sunday evening.

గేట్ ముందు పోలీసులు.. లోపల విద్యార్థులు.. JNU వద్ద టెన్షన్

Posted: 02/22/2016 01:47 PM IST
Tension in jnu delhi

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వద్ద ఉదయం నుండి ఉద్రిక్తత నెలకొంది. దేశద్రోహం ఆరోపణలను ఎదుర్కొంటున్న విద్యార్థులు వర్సిటీ లోపల సమావేశమయ్యారు. దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్ తో పాటు మరో నలుగురు కూడా వర్సిటీలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద సమావేశమయ్యారు. కాగా విద్యార్థి సంఘం నాయకులతో పాటు చాలా మంది విద్యార్థులు కూడా అక్కడికి చేరుకోవడం.. వర్సిటీ బయట పోలీసులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్ఘల్ గురు వర్దింతి సందర్భంగా నిర్వహించిన సభలో ఉమర్ తో పాటు మరికొంత మంది దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు పోలీసలు ఆరోపిస్తున్నారు.

కాగా గేట్ బయట ఉన్న పోలీసులు అనుమతి కోసం వైస్ ఛాన్స్ లర్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. కాగా తాము దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి నినాదాలు చెయ్యలేదని ఉమర్ వెల్లడించారు. తాను ఓ ముస్లిం అయినందుకే తనను టార్గెట్ చేశారని విమర్శించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోనని... కావాలంటే అరెస్టు చేసుకోవాలని పోలీసులకు సవాల్ విసిరాడు. కాగా మరోపక్క దిల్లీ పోలీసులు స్టడెంట్స్ కు శాంతిగా ఉండాలని పిలుపునిస్తున్నారు. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దని హితవుపలుకుతున్నారు. కాగా వర్సిటీలోకి పోలీసులను అనుమతించాలా వద్దా అన్నదాని మీద టెన్షన్ ఇంకా కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : JNU  JNU University  Delhi  Anti-national slogans  Umar halid  

Other Articles