One lakh CCTV cameras in Hyderabad soon

One lakh cctv cameras in hyderabad soon

CCTV cameras, One Lakh cameras, Hyderabad, Telangana Govt

Around one lakh CCTV cameras will be installed soon in Hyderabad and Cyberabad police commissionerates. The cameras will be installed in areas where the public has not come forward to participate in the Community CCTV Project.

హైదరాబాద్ లో లక్ష కెమెరాలతో నిఘా

Posted: 02/22/2016 09:31 AM IST
One lakh cctv cameras in hyderabad soon

ప్రభుత్వం హైదరాబాద్ ను విశ్వనగరంగా చేస్తామంటూ ప్రకటించింది. అయితే అందుకుగాను భద్రతలో ముందుగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పట్టపగలు చైన్ స్నాచింగ్.. శివార్లలో దొంగల బీభత్సం.. ఇలాంటి వార్తలు మనకు రోజూ కనిపిస్తూ ఉంటాయి. వీటికి చెక్ చెప్పేందుకు పోలీసులు నగర వీధుల్లో లక్ష సీసీ కెమెరాల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, సూరత్ తదితర నగరాలకు దీటుగా జంట కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశారు. పలు కాలనీలు, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో ఈ ఏడాది చివరికి వీటిని లక్షకు చేర్చాలనే లక్ష్యంతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు ముందుకు వెళ్తున్నారు.

గతంలోనే హైదరాబాద్, సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో సిసి కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని అనుకున్నా అది ప్రారంభం దశలోనే ఉండిపోయింది. కాగా ప్రస్తుతం ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. నగరంపై నిరంతర పర్యవేక్షణ, నేరగాళ్లపై నిఘా, కేసుల్ని కొలిక్కి తీసుకురావడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటన్నింటినీ ఆయా కమిషనరేట్లలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్(సీసీసీ)కు అనుసంధానం చేస్తారు. ఈ వ్యవస్థకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని జోడించే పనిలో ఉన్నారు అధికారులు. ప్రభుత్వం ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు కేటాయించడంతో డిసెంబర్ నాటికి ప్రభుత్వ, ప్రైవేట్‌వి కలిపి లక్ష కెమెరాల ఏర్పాటు, కనెక్టివిటీ లక్ష్యంతో జంట కమిషనర్లు ముందుకు వెళ్తున్నారు. కానీ ఎంత వ్యవధిలో వీటిని ఏర్పాటు చేస్తారు.. బడ్జెట్ లో వీటి కోసం ప్రత్యేకంగా కేటాయింపులు ఏమైనా ఉంటాయా అన్నదాని మీద క్లారిటీ రావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CCTV cameras  One Lakh cameras  Hyderabad  Telangana Govt  

Other Articles