Batting for Family# Sachin Tendulkar breezes into wilds of Umred-Karhandla near Nagpur

Sachin tendulkar soaks in pleasure of mother nature posts selfie

sachin tendulkar, tendulkar selfie, tendulkar runs, sachin records, sachin centuries, india cricket, bcci, sports, cricket news, cricketSachin Tendulkar soaks in pleasure of mother nature, posts selfie

Sachin Tendulkar is enjoying family holidays these days…guess where?? Yes he is breezing into the wilds of Umred-Karhandla wildlife sanctuary near Nagpur.

అభిమానులకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ సవాల్..

Posted: 02/20/2016 08:07 PM IST
Sachin tendulkar soaks in pleasure of mother nature posts selfie

మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ అప్పుడప్పుడు తన అభిమానులకు ట్విస్టు ఇస్తుంటారు. ఆ మధ్య తాను రాసిన పుస్తకానికి ఏం పేరు పెట్టాలన్న విషయమై.. మంచి టైటిల్ చెప్పిన వారికి బహుమానాలు కూడా వుంటాయని స్పష్టం చేసిన సచిన్.. తాజాగా మరో ట్విస్టును కూడా ఇచ్చారు.  తానేక్కడున్నానో కనుక్కొండి చూద్దాం అంటూ ఆయన అభిమానులకు సరదాగా ఓ సవాలు విసిరారు. అయితే ఏ విదేశాల్లో వున్నారని అభిమానులు అనుకోకూడదని భావించిన సచిన్ ఓ క్లూ కూడా ఇచ్చాడు.

తన సొంతగడ్డపై ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరుతున్నానంటూ ఓ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. అయితే కేవలం ఫొటో చూసి.. తన లొకేషన్ కనుక్కోవడం అభిమానులకు కష్టం అవుతుందని అనుకున్నారో ఏమో గానీ.. అది మహారాష్ట్రలోదని క్లూ కూడా ఇచ్చారు.  కౌబోయ్ టోపీ పెట్టుకుని.. ఎక్కడో అడవుల్లో సంచరిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటో.. సచిన్‌లోని ప్రకృతి ప్రేమికుడి కోణాన్ని కూడా చూపిస్తోంది. అయితే ఈ అడవులు ఎక్కడివో, రాష్ట్రంలో ఏ మూల ఉన్నాయో కనుక్కోడానికి ఆయన అభిమానులు మాత్రం నానా కష్టాలు పడుతున్నారు. మీకేమైనా తెలిస్తే మాత్రం సచిన్‌కు ట్విట్టర్ ద్వారా రిప్లై పెట్టి చూడండి. అల్ ది బెస్ట్.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachim tendulkar  family holidays  nagpur  Umred-Karhandla wildlife sanctuary  

Other Articles

Today on Telugu Wishesh