Dropped like a hot potato: BS Bassi no longer in the running to be CIC

Delhi police chief bs bassi dropped from list for key post amid jnu row

Delhi Police Chief, BS Bassi, Dropped, List For Key Post, JNU Row, Arun Jaitely, Bimal Julka, BJP, CIC, Information Commissioner, JNU, JNURow, Mallikarjun Kharge, Narendra Modi

Delhi Commissioner of Police BS Bassi's candidature has been dropped from the list for the post of Information Commissioner, said news reports.

అయ్యో బస్సీ.. అయ్యయ్యో.. ఏలా నీ ఆశలు మసి..!

Posted: 02/19/2016 04:35 PM IST
Delhi police chief bs bassi dropped from list for key post amid jnu row

జవహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ జేఎన్ యూ గొడవ ఢిల్లీ పోలిస్ కమీషనర్ బీఎస్ బస్సీ ఆశలను మసి చేసింది. ఆయనను వరించనున్న కీలకపదవికి జేఎన్యూ వివాదం తిలోదకాలద్దింది. తన ఉద్యోగ బాధ్యతలు ముగిసిన అనంతరం మరో ఉన్నత స్థానంలో కొనసాగాల్సిన ఆయనకు ఆ అవకాశం దక్కేలా కనిపించడం లేదు. జేఎన్యూ సమస్యను పరిష్కరించలేకపోవడం ఆయనను ఈ బాధ్యతలకు అందకుండా చేసినట్లు కీలక వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు బాస్గా విధులు నిర్వర్తిస్తున్న బస్సీ ఈ నెలాఖరున పదవీ బాధ్యతల నుంచి విరమణ పొందనున్నారు.

అయితే, భారత సమాచార కేంద్ర కమిషన్ (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్-సీఐసీ)లో ఉన్న మూడు కమిషనర్ ఖాళీల భర్తీ కోసం కమిటీ సిద్ధం చేసిన జాబితాలో బస్సీ పేరు కూడా చేర్చినట్లు తెలిసింది. అయితే, గతంలో కేజ్రీవాల్ తో గొడవలు పెట్టుకొని బీజేపీ ఏజెంట్ అనిపించుకోవడం, తాజాగా జేఎన్యూ వివాదంలో అతి చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగేలా వ్యవహరించినందుకు ప్రస్తుతం ఆ కమిటీ నుంచి బస్సీ పేరును పక్కకు పెట్టినట్లు తెలిసింది. సీఐసీ కమిషనర్ల నియామకం కోసం ఏర్పాటుచేసిన కమిటీకి అధ్యక్షుడికి ప్రధాని నరేంద్రమోదీ, మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఉన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi Police Chief  BS Bassi  Dropped  List For Key Post  JNU Row  

Other Articles