Youths thrashed on train for mobile theft, videos go viral

Youths thrashed on train for mobile theft videos go viral

Mumbai, Mumbai Railway station

Video clips of two youths being stripped and whipped with belts at a railway platform and beaten again on a local train for allegedly stealing a mobile phone have gone viral with railway police launching an inquiry. The videos have also been aired by some news channels, but the time, place and the identity of the persons involved are not known yet.

ITEMVIDEOS: దొంగతనం చేశారని బట్టలూడదీసి కొట్టారు

Posted: 02/18/2016 10:35 AM IST
Youths thrashed on train for mobile theft videos go viral

ముంబైలో దొంగతనం చేశారని ఇద్దరు యువకులను కొంత మంది చితకబాదారు. చితకబాదడం అంటే అలా ఇలా కాదు.. బట్టలూడదీసి.. అతి దారుణంగా.. ఎంతలా ప్రాధేయపడుతున్నా కానీ వినకుండా రైల్వే స్టేషన్ లో స్థంభానికి కట్టేసి మరీ కొట్టారు. అయితే తమ ఫోన్లు దొంగతనం చేస్తున్నారని... కొంత మంది వారిని పట్టుకున్నారు. అయితే అలా దొరికిన వారిని అతి దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో రైల్వే పోలీసులు వారిని గుర్తించేపనిలోపడ్డారు.

మొబైల్ ఫోన్‌ను దొంగలించారన్న కారణంతో ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణం జరిగింది. ఇద్దరు టీనేజ్ యువకులను కొందరు ప్రయాణికులు చితకబాదారు. వారి బట్టలు విప్పి దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. బాధిత యువకులు నిస్సహాయంగా వేడుకుంటున్నా కనికరం చూపని ఆ వ్యక్తులు దుస్తులు విప్పి వారిని రైలు కంపార్ట్‌మెంట్‌లో చితకబాదారు. అనంతరం ప్లాట్‌ఫామ్‌పైకి దిగిన తర్వాత కూడా మళ్లీ యువకులపై దాడి చేసి.. తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయాలైన ఆ యువకుల పరిస్థితి ఏమిటన్నది తెలియరాలేదు. కొన్ని రోజుల కిందట జరిగినట్టు భావిస్తున్న ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, వీడియో ఆధారంగా యువకులను, దాడి చేసినవారిని గుర్తిస్తామని ముంబై రైల్వే పోలీసులు తెలిపారు.

Image Source: GalliNews

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  Railway station  Video  

Other Articles