Kanhaiya Kumar said he did not gave anti nation slogans

Kanhaiya kumar said he did not gave anti nation slogans

Kanhaiya Kumar, JNU, Delhi, Patiyala court

Slapped with sedition charge, JNUSU president Kanhaiya Kumar said he is an Indian who has full faith in judiciary and the Constitution, a statement the police latched on to say that it will not oppose his bail. “I have said earlier too. I am an Indian. I have full faith in the Constitution as well as the judiciary of the country,” Mr. Kumar told metropolitan magistrate Lovleen when he was produced for remand proceedings.

ఆ నినాదాలను నేనివ్వలేదు.. ఎవరో ఇచ్చారు: కన్హయ

Posted: 02/18/2016 09:18 AM IST
Kanhaiya kumar said he did not gave anti nation slogans

దేశంలో తీవ్ర దుమారానికి కారణమైన జెఎన్ యూ విద్యార్థి నాయకుడు కన్హహ కుమార్ ను దేశద్రోహం నేరం కింద అరోస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే కోర్టులో కన్హయ కుమార్ తన గళాన్ని వినిసపించారు. తాను భారతీయుడిని. రాజ్యాంగంపై, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసముంది అని చెప్పారు. కొందరు బయటివ్యక్తులు ఆ రోజు జరిగిన సభలో చేసిన నినాదాలను తాను సమర్థించడంలేదని న్యాయస్థానం ముందు కుమార్ స్పష్టం చేశారు. దేశంలో, సమాజంలో, జేఎన్‌యూలో శాంతికి ఎవరూ భంగం కలిగించవద్దని కుమార్ విజ్ఞప్తి చేశారు. తనపై మీడియా విచారణ జరుపడం బాధాకరమని అన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేకపోతే మీడియాలో విచారణ జరుగరాదని.. తాను దేశద్రోహినైతే జైలుకు పంపండి అని కోర్టుకు సమర్పించిన ఒక ప్రకటనలో కుమార్ తెలిపారు.

ఈ ప్రకటనను ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు. సుప్రీంకోర్టు పంపిన కమిటీ కుమార్‌ను కోర్టు ఆవరణలో కలుసుకుని అతనిపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నది. పోలీసులు తనను బాగానే చూసుకున్నారని కుమార్ కమిటీసభ్యులకు చెప్పారు. కొందరు దుండగులు తనను చితకబాదారని వివరించారు. దీనికి మేజిస్ట్రేటు వెంటనే స్పందించి కోర్టులోనే కుమార్‌కు వైద్య పరీక్షలు జరిపించారు. మరోసారి కుమార్‌పై దాడి జరగకుండాచూడాలని డీసీపీకి, భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు మేజిస్ట్రేటు ఆదేశాలు జారీ చేశారు. వచ్చేనెల 2 వరకుజుడిషియల్ కస్టడీ విధించారు. దాడుల నేపథ్యంలో భద్రతను జడ్జీలు సమీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanhaiya Kumar  JNU  Delhi  Patiyala court  

Other Articles