Jadavpur University echoes with pro-Afzal and Ishrat slogans

Jadavpur university echoes with pro afzal and ishrat slogans

JNU, Delhi, Kanaiah Kumar, Afzal guru, Jadavpur University

The tide of protest in Delhi against the crackdown on students of Jawaharlal Nehru University reached Jadavpur University here on Tuesday with students raising precisely those slogans that led to sedition charges against some JNU students including its students union president Kanhaiya Kumar.

ITEMVIDEOS: ఉగ్రవాది అప్ఘల్ గురుకు అనుకూలంగా నినాదాలు

Posted: 02/17/2016 11:22 AM IST
Jadavpur university echoes with pro afzal and ishrat slogans

నిన్న దిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటన కోల్ కత్తాలోని జాదవ్ పూర్ యూనివర్సిటీలో కూడా పునరావృతమైంది. దాంతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే దిల్లీ యూనివర్సిటీలో చోటుచేసుకున్న ఘటన మీద దేశంలో తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జాదవ్ పూర్ యూనివర్సిటిలో కూడా అప్ఘల్ గురుకు అనుకూలంగా నినిదాలు హోరెత్తాయి.  జేఎన్ యూ విద్యార్ధుల అరెస్టుకు నిరసనగా నిన్న రాత్రి వర్సిటీలోని రోడ్లపైకి వచ్చిన రెండు విద్యార్ధి సంఘాలు అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు. అప్ఝల్ గురుతో పాటు ఎస్ఏఆర్ గిలానీలు స్వేచ్ఛ కోసం గొంతెత్తారు.... స్వేచ్ఛను స్వచ్ఛందంగా ఇవ్వకపోతే లాక్కోవాల్సి వస్తుంది అంటూ పెద్ద పెట్టున విద్యార్థులు నినాదాలు చేయడంతో ఒక్కసారిగా కలకత్తాలో వాతావరణం వేడెక్కింది.

దీనిక తోడు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లష్కరే తోయిబా తీవ్రవాదిగా ఆరోపణలతో 2004లో గుజారత్ పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమైన ఇష్రాంత్ జాహాన్ ది బూటకపు ఎన్ కౌంటర్ అంటూ నినదించారు. కాశ్మీర్ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని, అఫ్జల్ గురు విషయంలో ప్రభుత్వం చాలా కుట్ర పూరితంగా వ్యవహరించిందని మాజీ ఎఐఐఐఎస్ఏ ప్రెసిడెంట్ అమిత్ మిశ్రా వ్యాఖ్యానించాడు. ఢిల్లీ జేఎన్ యూలో దేశం ద్రోహం క్రింద అరెస్టెయిన కన్హయా కుమార్ జాతి వ్యతిరేకి ఆయితే మేము కూడా అదే కోవకు చెందుతామని అన్నాడు. ఈ ఘటనసై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించక పోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JNU  Delhi  Kanaiah Kumar  Afzal guru  Jadavpur University  

Other Articles