'Smart Coaches' on trains to give home-like comfort soon

Smart coaches with home like comfort soon

Indian Railways, Smart coaches, Smart coaches initiative, Railway, Suresh Prabhu,Railway Budget new trains,Railway Budget fare hike,railway budget 2016,Budget 2016 expectations,Budget 2016

rain journeys could soon become a more comfortable with the railways planning to launch all-new `smart coaches' where travellers can avail of efficient ways of finding journey-related information along with more on-board comfort.

రైలు ప్రయాణాలు.. త్వరలో ఇంటి తరహాలోనే అన్ని సౌకర్యాలతో

Posted: 02/15/2016 09:07 PM IST
Smart coaches with home like comfort soon

రైలు ప్రయాణమా పరమ బోర్.. కాసింత దూరమైతే పర్వాలేదు కానీ, ఏకంగా 24 గంటలు ఆపైన ప్రయాణాలైతే.. అమ్మో అదో బోర్ ప్రయాణమనే చెప్పాలి అనుకుంటున్నారా..? అయితే ఇకపై ఆ తరహా స్పందనలు త్వరలో చెల్లుచీలు పడనుంది. ఎందుకంటే.. మున్మందు రైల్వే ప్రయాణం మరింత సుఖవంతంగా మారనుంది. మునుపెన్నడు లేని సౌకర్యాలు రైలు బోగీల్లో అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు బోగీలతో పాటు వాటితో అనేక ఆధునిక సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

కొత్తగా స్మార్ట్ కోచ్లను తీర్చిదిద్దుతున్నారు. ఇవి పూర్తయి వినియోగంలోకి వస్తే అచ్చం ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు అందుతాయో అలాంటివి వీటిల్లోను లభ్యం కానున్నాయి. ఈ స్మార్ట్ బోగీల్లో ఉండే సౌకర్యాలు పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్న సీటింగ్ సిస్టం కన్నా అత్యాధునిక పరికరాలతో సీట్లు తయారు చేయనున్నారు. జీపీఎస్, వైఫైవంటి సౌకర్యాలతోపాటు నిద్రనుంచి మేల్కొనెలా అలారం గడియారాలు, ఎల్ఈడీ ఆధారిత రిజర్వేషన్ నోటీసు బోర్డులు, బెర్త్ ఇండికేటర్స్, విమానాల్లో ఏర్పాటుచేసినట్లుగా ప్రయాణికుడి పూర్తి సమాచారం పొందపర్చబడి వుంటుంది

వీటితో పాటు ఆడియో రూపంలో ఎనౌన్స్ మెంట్ కూడా చేయడం జరుగుతుంది. దీంతోపాటు టీ, హాట్ వాటర్, కాఫీవంటి పానియాలకోసం ప్రత్యేకంగా వెండింగ్ మెషిన్ కూడా ఉండనుంది. దీంతోపాటు ప్రతిఒక్క ప్రయాణికుడికి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. సీసీటీవీ నిఘా కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ కోచ్ల నిర్మాణం ప్రతిపాదనలు ఈ రైల్వే బడ్జెట్లోనే ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suresh Prabhu  smart coaches  railway budget  gps alarm  entertainment  

Other Articles