KCR calls Harish Rao as Bullet

Kcr calls harish rao as bullet

Telangana, TRS, Harish Rao, KCR, NarayanaKhed

Telangana Cm KCR calls harish Rao as Bullet. Harish Rao campaigning in NarayanKhed.

కేసీఆర్ హరీష్ రావును సభలో అలా పిలిచాడు

Posted: 02/11/2016 09:32 AM IST
Kcr calls harish rao as bullet

తెలంగాణ సిఎం కేసీఆర్ కు, అల్లుడు హరీష్ రావుకు పడటం లేదని.. వీరిద్దకి మధ్యన విభేదాలు ఉన్నాయని గత కొంత కాలంగా పుకారు షికారు చేస్తోంది. కాగా నారాయణఖేడ్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ హరీష్ రావు గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. హరీష్ రావు మిమ్మల్ని భూపాల్ రెడ్డిని గెలిపించాలని అడుగుతున్నాడు. నారాయణ్ ఖేడ్ ను సిద్ధిపేటలాగా మారుస్తా అంటున్నాడు. మీరు అలాగే చేసి భూపాల్ రెడ్డికి ఓటేస్తే గోదావరి నీళ్లు తీసుకొచ్చి మీ కాళ్లు కడుగుత' అని కేసీఆర్ ఆన్నారు. నారాయణ ఖేడ్ చరిత్రలో ఇంత పెద్ద సభ జరగలేదని, గతంలో రెండు సార్లు ఇక్కడి వచ్చానని కేసీఆర్ అన్నారు. ఇక్కడ ఇంత వరకు మార్కెట్ కమిటీ ఉండదా, హాస్పత్రులు ఉండవా, ఇంత దారుణంగా ఉంటుందా, ఇంకా దారిద్ర్యం కావాల్నా.. కాంగ్రెస్, టీడీపీ పాలన పాత చింతకాయ పచ్చడేగా. కాంగ్రెస్, టీడీపీ ఏం చేసిర్రో మీకు తెలియనిది కాదు. తెలివిగా ఓటెయ్యాలంటే భూపాల్ రెడ్డిని గెలిపించాలి. నారాయణ ఖేడ్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాను. రెండు రోజులపాటు నేనే స్వయంగా తిరిగి అన్ని అభివృద్ధి పనులు చేస్తా' అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

నారాణఖేడ్ బహిరంగసభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్...స్టోరీలు, కథలు చెప్పడానికి ఇక్కడికి రాలేదన్నారు. ఇక్కడ ప్రచారానికి వచ్చిన నాయకులు చెబుతున్నారు ఇక్కడి పరిస్ధితులు గురించి ... నారాయణ ఖేడ్ లో స్వాతంత్ర్యంలేదు. గుండాగిరి దాదాగిరి, డబ్బులివ్వడం, తాగుడు పోయడం, ఒట్లు వేయించడం అంతా పాత చింతకాయ పచ్చడే అన్న ఆయన. ఏ పార్టీకి కూడా బాగుపరుచుదామన్న సోయి లేదన్నారు. దీనిపై విద్యాధికులు, ఉద్యోగులు, మేధావులు ఆలోచించాలన్నారు. బ్రహ్మండమైన మంత్రి మీ జిల్లాలో ఉన్నాడు. బుల్లెట్‌లా దూసుకెళ్లే మనసత్వం గలవాడు. నాలుగైదు నెలలుగా మీ దగ్గరే పనిచేస్తున్నాడు. ఆయనకు పదవులు అవసరంలేదు... ఆల్ రెఢీ మంత్రిగా ఉన్నాడు. ఇక్కడ తిరిగి మీ బాధను చూసి. గుండెలు అవిసిపోయి. మీ కాళ్లు మోగ్గుతాని మాట్లాడుతున్నాడు. నా కాళ్లు కడగాల్సిన పనిలేదు. ఈ హరీష్ రావు చేతనే గోదావరి నీళ్లు తెచ్చి గట్టు లింగంపల్లి ప్రాజెక్ట్ తెచ్చుకొని మీ కాళ్లు కడిగే బాధ్యత నాది అని కేసీఆర్ అన్నారు. నారాయణ ఖేడ్ కు వెలుతురు రావాలి అన్న ఆయన కెసీఆర్ మెండివాడు అనుకుంటే సాధించి తీరుతాడని గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  TRS  Harish Rao  KCR  NarayanaKhed  

Other Articles