errabelli and prakash goud quits tdp, joins trs

Another big jolt to telangana tdp errabelli joins trs

errabelli dayakar rao, prakash goud, tdplp floor leader, tdp leaders, telangana tdp, trs, chandrababu naidu, nara lokesh, revanth reddy, chandrashekar rao, harish rao

another shock to teleanaga tdp as telangana tdplp floor leader errabelli dayakar rao and prakash goud joins ruling trs party.

టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. టీఆర్ఎస్ లోకి ఎర్రబెల్లి సహా ప్రకాష్ గౌడ్..

Posted: 02/11/2016 06:35 AM IST
Another big jolt to telangana tdp errabelli joins trs

టీడీపీ సీనియర్ నేత, శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. దీంతో నాయకులను తయారు చేసే కర్మాగారంగా చెప్పుకున్న తెలంగాణ టీడీపీ పార్టీ రమారమి ఖాళీ అయ్యంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. కుత్బుల్లాపూర్ టీడీపీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరిన మరుసటి రోజునే ఇలా ఏకంగా టీడీఎల్పీ నేత మరో ఎమ్మెల్యేతో కలసి టీఆర్‌ఎస్‌లో చేరి టీడీపీకి కోలుకోలేని షాకిచ్చారు.
 
ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరికకు భారీ నీటిపారుదల మంత్రి టి.హరీశ్‌రావు, ముఖ్యపాత్ర ఫోషించారని తెలుస్తుంది. నిన్న సాయంత్రం నారాయణ్ ఖేడ్ నుంచి హైదరాబాద్ ఆదర్శనగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఎర్రబెల్లి నివాసానికి చేరుకున్న ఆయన గంటసేపు ఎర్రబెల్లితో చర్చలు జరిపారు. ఎర్రబెల్లి సహా ఆయన కుటుంబ సభ్యులను కూడా ఒప్పించారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం హరీశ్ తన కారులోనే ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్ ఇద్దరినీ వెంట తీసుకుని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్  వారిద్దరితో దాదాపు గంటసేపు మాట్లాడారు. అనంతరం వారికి గులాబీ కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
 
తెలంగాణలో టీడీపీ మనజాలదు

తెలంగాణ ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని, రాష్ట్రంలో టీడీపీ మనజాలదని ఎర్రబెల్లి అన్నారు. గులాబీ కండువా కప్పుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరో ఇద్దరు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌లోకి వచ్చే అవకాశముందని వివరించారు. వరంగల్ జిల్లాకు చెందిన మరికొందరు టీడీపీ నాయకులు కూడా త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరతారన్నారు. టీడీపీ శాసనసభా పక్షాన్ని (టీడీఎల్పీని) టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ ఇవ్వనున్నట్టు కూడా ఎర్రబెల్లి చెప్పారు. ‘‘టీడీపీని వీడటం బాధగానే ఉంది. తప్పని పరిస్థితుల్లో పార్టీ మారుతున్నా, కార్యకర్తలంతా క్షమించాలి. తెలంగాణలో టీడీపీని కాపాడే ప్రయత్నం చేశానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : errabelli dayakar rao  prakash goud  tdplp floor leader  tdp leaders  telangana tdp  trsa  

Other Articles