Om Puri | Nandita | judicial separation | News

Om puri and nandita judicial separation

Om Puri and Nandita judicial separation, Om Puri separation with nandita, Om Puri Nandita judicial separation, Om Puri Nandita separation, Om Puri separation with his wife, Om Puri, Nandita

Om Puri and Nandita judicial separation: Om Puri and wife Nandita have opted for judicial separation after 26 years of marriage.

65ఏళ్ల వయసులో భార్యతో విడిపోయిన ఓంపూరి

Posted: 02/10/2016 10:15 AM IST
Om puri and nandita judicial separation

బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపూరి(65) దంపతులు విడిపోయారు. సుధీర్ఘ కాలం పాటు సంసార జీవితాన్ని గడిపిన ఓంపూరి, నందిత దంపతులు తాజాగా విడిపోయారు. 2009లో నందిత ‘అన్ లైక్లీ హీరో, ది స్టోరీ ఆఫ్ ఓంపూరి’ పేర్లతో ఓంపూరి జీవిత చరిత్ర పుస్తకాన్ని రాసి, విడుదల చేసారు. ఇందులో ఓంపూరి వ్యక్తిగత జీవితం, అభ్యంతకర శృంగార ఘటనలకు సంబంధించిన విషయాలను ప్రచురించడం.. అందులో కూడా చాలా అగౌరవకరంగా వుండటంతో ఓంపూరికి ఎక్కడలేని కోపం వచ్చింది.

దీంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే ఓంపూరి తనపై దాడి చేసాడంటూ నందిత ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో గృహహింస కేసును నమోదు చేసింది. సీన్ కట్ చేస్తే... తాజాగా వీరిద్దరూ కోర్టు విడాకులు మంజూరు చేయలేదు. విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కిన వీరు... ఆ తర్వాత ఇద్దరు రాజీకి రావడంతో కోర్టు వారికి ‘జ్యూడీషియల్ సెపరేషన్’ మంజూరు చేసింది.

దీని ప్రకారం వీరిద్దరూ చట్టపరంగా భార్యభర్తలుగానే వుండాలి కానీ... విడివిడిగా వుండాలి. ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోకూడదు. వీరిద్దరి సంతానం(కొడుకు) ఇషాన్(18) బాగోగులను మాత్రం ఇద్దరూ చూసుకుంటారు. ఒకవేళ మళ్లీ తిరిగి ఎప్పుడైనా కలవాలనుకుంటే... ఎవరైనా ఓ థర్డ్ పార్టీ సమక్షంలోనే కలుసుకోవాలని షరతు విధించింది.

అలాగే ఓంపూరికి తన కొడుకును కలుసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో ఇద్దరూ ఒకరిపై మరొకరు పెట్టిన కేసులను ఉపసంహరించుకున్నారు. భవిష్యత్తులో మళ్లీ మీరు కలిసి జీవించే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించినపుడు.. ‘చెప్పలేం’ అని నందిత సమాధానమిచ్చారు. మరి వీరిద్దరూ భవిష్యత్తులో కలుస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Om Puri  Nandita  Separation  movies  bollywood news  

Other Articles