Celebrations started at Telangana Bhavan

Celebrations started at telangana bhavan

Telangana Bhavan, GHMC Election Results 2016, TRS, KCR, KTR, GHMC, Telangana, TDP

Celebrations started at Telangana Bhavan

ITEMVIDEOS: తెలంగాణ భవన్ వద్ద సంబరాలు

Posted: 02/05/2016 05:48 PM IST
Celebrations started at telangana bhavan

గ్రేటర్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అని అన్ని సర్వేలు ముక్త కంఠంతో చెప్పాయి. కారు దూకుడుకు అస్సలు ఎదురులేకుండా పోయింది. టీఆర్ఎస్ పార్టీకి చరిత్రలో తొలిసారిగా పూర్తి స్థాయి మెజారిటీని కనబరుస్తూ టీఆర్ఎస్ చరిత్రను తిరగరాసింది.  గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఊహించినదాని కంటే అధికార టీఆర్ఎస్ ఘనవిజయం దిశగా దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో పండగ వాతావరణం నెలకొంది.

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాగా, అప్పటికే టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్ కు  చేరుకున్నారు. ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు సర్వత్రా ఆసక్తి చూపారు. టీవీల ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను తెలుసుకుంటూ.. పార్టీ భారీ విజయం సాధించే సంకేతాలు వెలువడటంతో పార్టీ నాయకులతో సంతోషం పంచుకున్నారు. టీఆర్ఎస్ సొంతంగా మేయర్ పదవిని దక్కించుకునే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ నాయకుల సంబరం అంబరాన్ని తాకింది. మంత్రులు తెలంగాణ భవన్ కు వెళ్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Bhavan  GHMC Election Results 2016  TRS  KCR  KTR  GHMC  Telangana  TDP  

Other Articles