జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో జరిగే ఓట్ల లెక్కింపు అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాత్రి 8 గంటల వరకు గ్రేటర్ ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తి అవుతుంది. మొత్తం 150 డివిజన్లకు సంబంధించి 24 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును చేపడుతున్నారు. ఒక్కో కేంద్రంలో 6 నుంచి 10 డివిజన్ల ఓట్ల లెక్కింపు. ఎన్నికల విధుల్లో 5,626 మంది సిబ్బంది పాల్గొన్నారు. లెక్కింపు కేంద్రాల్లో 1674 టేబుళ్లను ఏర్పాటు చేసిన అధికారులు 827 రౌండ్లను చేపట్టనున్నారు. ఒక్కో రౌండ్‌కు 15 నిమిషాలు కేటాయింపు.
దత్తాత్రేయ నగర్, అక్బర్‌బాగ్. రెయిన్‌బజార్, నవాబ్‌సాహెబ్‌కుంట డివిజన్ల ఫలితాలు మొదటగా వెలువడనున్నాయి. కాగా చివరగా ఫలితాలు వెల్లడయ్యే డివిజన్లు ఈ విధంగా ఉన్నాయి. సరూర్‌నగర్, ఆర్కేపురం, చంపాపేట, గడ్డిఅన్నారం, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, మోండా మార్కెట్, కొత్తపేట. అన్నిటికంటే ఆఖరున వెల్లడయ్యేది పురానాపూల్ డివిజన్ ఫలితం.:జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కానున్న ఫలితాల వెల్లడి.. బహుశా రాత్రి 9 గంటలకు ముగుస్తుందని అంచనా.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more