Kapu's Temporarily Withdraws Agitation

Kapu s temporarily withdraws agitation

kapu, Mudragada padmanabham, Kapu reservations, KapuNadu, Tuni, chandrababu Naidu, kapu agitation

The Kapu reservation agitation launched in Tuni in East Godavari district by the former minister Mudragada Padmanabham took a violent turn with thousands of supporters setting a train and a police station on fire. After blocking national highway for the whole night Mudhragadda Padmanabham finally withdrew his agitation. Mudhragadda who was blocking national highway with his vehicle since morning, announced withdrawing the agitation.

ITEMVIDEOS: చంద్రబాబుకు ముద్రగడ అల్టిమేటం

Posted: 02/01/2016 09:42 AM IST
Kapu s temporarily withdraws agitation

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుకు కాపుల ఉద్యమం తీవ్ర తలనొప్పిగా మారింది. లక్షల సంఖ్యలో కాపు వర్గీయులు తమను ఓబీసీ కోటాలో చేర్చాలంటూ తుని వేదికగా గర్జించారు. కేవలం ఉదయం పది గంటల నుండి రాత్రి పదింటి దాకా జరిగిన ఉద్యమం ప్రభుత్వానికి చుక్కలు చూపించింది. తునిలో జరిగిన కాపు గర్జనలో బాగంగా ముద్రగడ పద్మనాం ఒక్కసారిగా ఉద్యమ కార్యాచరణ ఇప్పటి నుండే ప్రారంభిద్దామని పిలుపునివ్వడంతో ఉద్యమం ఒక్కసారిగా కీలక మలుపు తిరిగింది. అయితే ముందుగా కేవలం సభకు మాత్రమే అనుమతి తీసుకోవడం.. తర్వాత రాస్తారోకో, రైలు రోకోలకు పిలుపునివ్వడంతో పరిస్థితి తారుమారైంది.

ఏపిలో కాపులు చేస్తున్న ఆందోళనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఊహించని విధంగా కాపు వర్గీయులు ఒక్కసారిగా ఉద్యమబాట పట్టడం.. అందునా జీవో వచ్చే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని తేల్చడంతో చంద్రబాబు షాక్ తిన్నారు. అయితే తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకున్న ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. ఆందోళనను ప్రస్తుతానికి విరమిస్తున్నట్లు ప్రకటించారు. నేటి సాయంత్రం వరకు ప్రభుత్వానికి గడువు విధిస్తూ ముద్రగడ అల్టిమేటం జారీ చేశారు. అయితే నేడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడుతుండటం.. ముద్రగడ పద్మనాభం ఉద్యమం పై మెట్టుదిగకుండా ఉండటంతో పరిస్థితి చంద్రబాబుకు కఠినంగా మారింది. కాగా నేటి సాయంత్రం వరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకుంటే.. ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నట్లు ముద్రగట ప్రకటించారు. దాంతో ఈ సాయంత్రం ఏం జరుగుతుందో అని సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kapu  Mudragada padmanabham  Kapu reservations  KapuNadu  Tuni  chandrababu Naidu  kapu agitation  

Other Articles