Rahul gandhi Politics on Rothith suicide

Rahul gandhi politics on rothith suicide

Rohith, Rahul Gandhi, Rahul Gandhi in HCU, Rahul Gandhi About Rohith Suicide, Rohith suicide, Rohith Vemula Suicide, Hyderabad Central University

Rahul gandhi doing politics on HCU Student Rohith Vemula suicide. He visited HCU two times.

రోహిత్ మీద రాహుల్ రాజకీయం

Posted: 01/30/2016 01:58 PM IST
Rahul gandhi politics on rothith suicide

రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ లో చక్కర్లు కొడుతున్నారు. దిల్లీ వదిలి హైదరాబాద్ లో మకాం వేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య మీద పాపం రాహుల్ గాంధీ తెగ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ ఇలా అర్థరాత్రి హెచ్.సీ.యూ కు రావడానికి ఎందుకు అవనరం అనే ప్రశ్నకు సమాధానం రావాలి. అయితే అంతకు ముందు రాహుల్ గాంధీ తరఫున మరికొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం రావాలి. రాహుల్ గాంధీకి హైదరాబాద్ మీద ఎందుకంత ప్రేమ..? రాహుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పర్యటన వెనక అసలు రాజకీయం ఏంటీ మీకు తెలుసా..? మీకు ఆ రాజకీయం తెలిస్తే షాక్ అవుతారు. అయితే చూడండి రాహుల్ గాంధీ ప్లాన్..

* రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చనిపోయిన విద్యార్థి రాహుల్ మీద ఎందుకంత ప్రేమ..? తమిళనాడులో ముగ్గురు మెడిసిన్ చదువుతున్న అమ్మాయిలు చనిపోతే.. కనీసం మీడియా ముందు మాట్లాడని రాహుల్ రోహిత్ ఆత్మహత్య మీద ఏకంగా దిల్లీ నుండి హైదరాబాద్ కు అది కూడా అర్దరాత్రి ఎందుకు వచ్చారు..? రాజకీయ కోణం లేదా..?

* హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో జరిగిన ఘటన మీద దిల్లీతో సహా అన్ని రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీల విద్యార్థులు స్పందిస్తారు. అప్పుడు విద్యార్థులకు అండగా ఉన్న రాహుల్ అన్న క్రెడిట్ కొట్టెయ్యడానికే కదా ఇదంతా డ్రామా..?

* దిల్లీ ఎన్నికల్లో, లోక్ పాల్ మీద జరిగిన ఉద్యమంలో ఎంతో కీలకంగా ఉన్న దిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు రోహిత్ ఆత్మహత్య మీద ఖచ్చితంగా స్పందిస్తారు. అలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటన వారి దృష్టికి వస్తుంది.. రాహుల్ గాంధీ అక్కడికి వెళితే.. వారికి అండగా ఉంటే.. రాహుల్ గాంధీ మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది.

* దిల్లీలో ఆప్ పార్టీ గెలుపులో, కేజ్రీవాల్ కు అద్భుతమైన విజయాన్ని సంపాదించడంలో దిల్లీ విద్యార్థులు ఎంతో కీలకం కాబట్టే.. అందరి కంటే ముందే రోహిత్ ఆత్మహత్య మీద స్పందించారు.

* ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. అటు విద్యార్థులకు దగ్గరకావడమే కాకుండా ఈ ఘటనలో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్ర్ముతి ఇరానీలు ఉండటం కూడా రాహుల్ కు కలిసివచ్చే అంశం.

* రాహుల్ గాంధీ సొంత నియోజక వర్గం అమేధీలో స్ర్ముతి ఇరానీ హవా మొదలైంది. దాంతో స్ర్ముతి ఇరానీని కట్టడి చేసేందుకు రోహిత్ ఆత్మహత్య వివాదం రాహుల్ గాంధీకి అందివచ్చిన అవకాశంగా వాడుకుంటున్నారు.

* గతంలో నిర్భయ ఘటన జరిగినప్పుడు కనీసం మీడియా ముందు వచ్చి మాట్లాడని రాహుల్ గాంధీ.. ఆ ఘటన తన యుపిఎ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడే జరిగింది అన్న విషయాన్ని మరిచిపోయినట్లున్నారు. పైగా రోహిత్ కు ఉన్న దళిత కార్డును కూడా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles