florida woman steal police car and drive it without pant

Florida woman steal police car and drive it without pant

Florida, Woman, Police car, Pantless

A Florida woman steal the police vehicle at pam beach green market. That woman first removed her pant and get into the car and ran away.

పోలీస్ కారులో ప్యాంట్ లేకుండా అమ్మాయి వీరంగం

Posted: 01/27/2016 03:08 PM IST
Florida woman steal police car and drive it without pant

సీటు బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చెయ్యడం మీకు, మీ కుటుంబ సభ్యులకు మంచిది అని గవర్నమెంట్ వాళ్ల ప్రకటన చూసిందో మరి చూడలేదో కానీ ఓ అమ్మాయి తప్పతాగి తలతిక్క పని చేసింది. అమ్మడు పూటుగా తాగి నానాయాగీ చేసింది.  అసలే ట్రాఫిక్ పోలీస్ వాహనాన్ని దొంగతనం చేసి పారిపోతూ తనని పట్టుకున్న పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చిందో యువతి. ఈ సంఘటన అమెరికాలోని ప్లోరిడాలో లో చోటు చేసుకొంది. అమ్మడు ఇచ్చిన షాక్ నుండి తేరుకున్నాక.. ఏం జరిగిందో పోలీసులు వివరాలను బయటకు వెళ్లడించారు.

ప్లోరిడాలోని పామ్ బీచ్ గ్రీన్ మార్కెట్ వద్ద తమ విధుల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు తమ వాహనాన్ని నిలిపి అందులోంచి దిగారు. కానీ ఇంజన్ ఆఫ్ చేయలేదు. అదే టైంలో అమరా కోరిన్ మారేరో  అనే అమ్మాయిుు ఉన్న పలంగా తన ప్యాంట్ ను విప్పేసి.. ఆ కారెక్కి... డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. ఇది చూసిన పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించి ... వాహనాన్ని పట్టుకొన్నారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న సదరు యువతిని వాహనం నుంచి కిందకు దించేందుకు డోర్ తెరిచారట. ఆమె నడుము కింద భాగం నుంచి ఎటువంటి దుస్తువులు లేకుండా నగ్నంగా ఉండడంతో అది చూసిన పోలీసులు షాక్ తిన్నారట. ఆమెతో మాట్లాడిన పోలీస్ అధికారులు ఆ యువతి మద్యం మత్తులో ఉందని గుర్తించారు.. పైగా ఆమె వద్ద డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకపోవడంతో ఆమెను వాహనం దొంగతనం నేరం కింద అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరిచారు. 15 వేల డాలర్ల పూచీకత్తుపై కోర్ట్ బెయిల్ మజూరు చేసినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Florida  Woman  Police car  Pantless  

Other Articles