Revanth reddy said that nara Lokesh bacha but not lucha like you

Revanth reddy said that nara lokesh bacha but not lucha like you

Revanth Reddy, Talasani Srinivas, Lokesh, KTR, GHMC Elections

TTDP Working President Revanth Reddy slams Telangana Minister Talasani Srinivas. He said that nara Lokesh bacha but not lucha like you

లోకేశ్ బచ్చానే కానీ నీలా లుచ్చా కాదు

Posted: 01/26/2016 02:49 PM IST
Revanth reddy said that nara lokesh bacha but not lucha like you

నారా లోకేష్ బచ్చానే.. కానీ నీలా లుచ్చా కాదు అంటూ తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరోసారి కాకరేపారు. ఎన్నికల టైం దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్, నారా లోకేశ్ మధ్య ఇప్పటికే మాటల తూటాలు పేలుతుండగా.. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ లోకేశ్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. శశిధర్ రెడ్డి పెద్ద దొంగ అయితే.. తలసాని చిన్న దొంగ అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ను బచ్చా అని వ్యాఖ్యానించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తనదైన సైల్లో రెచ్చిపోయారు. “తలసాని లోకేష్ ను బచ్చా అంటున్నారు. లోకేష్ బచ్చానే కావచ్చు కానీ… తలసానిలా లుచ్చా కాదు” అని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.

అంతేకాదు టీడీపీ పెట్టిన భిక్షతో తలసాని ఎమ్మెల్యే అయ్యాడని… దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి… అదే నియోజకవర్గంలోని టీడీపీ ఇంచార్జ్ కూన వెంకటేష్ గౌడ్ పై పోటీ చేసి గెలవాలని తలసానికి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఆ రేంజ్ లో ఫైర్ కావడానికి తలసాని వ్యాఖ్యలే కారణం. టీడీపీలో సుధీర్ఘం కాలం పని చేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రస్తుత తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. నారా లోకేష్ ఎవరో తనకు తెలియదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో లోకేష్ ప్రచారంపై ప్రశ్నించగా..”లోకేష్ ఎవరు?.. ఓ ఆ బచ్చానా?” అంటూ ఆయన అనడం హాట్ టాపిక్ గా మారింది. తలసాని ఆ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఇలా కౌంటర్ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Talasani Srinivas  Lokesh  KTR  GHMC Elections  

Other Articles