Police case filed on central minister bandaru dattatreya

Police case filed on central minister bandaru dattatreya

Hyderabad student suicide, Dalit student suicide, Hyderabad central university, bandaru dattatreya, Police case on bandaru dattatreya

Union minister Bandaru Dattatreya has been named in a police case amid anger at a Hyderabad University over the suicide of a research scholar who was found hanging yesterday in a hostel he was banned from two weeks ago. Education Minister Smriti Irani has sent a two-member team to investigate what happened

బండారు దత్తాత్రేయ మీద కేసు నమోదు

Posted: 01/18/2016 03:53 PM IST
Police case filed on central minister bandaru dattatreya

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడి ఆత్మహత్య తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాగా రోహిత్ అనే విద్యార్థి నాయకుడి ఆత్మహత్య కేసులో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మీద కేసు నమోదైంది. ఏబివిపి కార్యకర్తల మీద దాడి చేసిన ఘటన మీద స్పందిస్తు.. రోహిత్ సహా పలువురు విద్యార్థులను సస్పెండ్ చెయ్యాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ లేఖ రాసినట్లు విమర్శలు వస్తున్నాయి. దాంతో విచారణలో భాగంగా కేసులో దత్తాత్రేయ పేరును కూడా చేర్చారు పోలీసులు. కాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి విసి అప్పారావు మాత్రం తన మీద ఎలాంటి వత్తిడి లేదని.. పూర్తిగా విచారణ  చేసిన తర్వాత మాత్రమే రోహిత్ తో పాటు మరికొందరు విద్యార్థి నాయకులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

కేంద్ర మంత్రి దత్తాత్రేయ రాసిన లేఖ వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో, గచ్చీబౌలీ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు కాగా, ఈ మధ్యాహ్నం దత్తాత్రేయ స్పందించారు. వర్శిటీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని, జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం అందినందునే తాను లేఖ రాశానని ఆయన చెప్పారు. ఏబీవీపీ కార్యకర్తలను దారుణంగా కొట్టినందునే తాను కేంద్ర మానవ మంత్రిత్వ శాఖకు లేఖను పంపానని, ఆపై ఏం జరిగిందన్నది తనకు తెలియదని అన్నారు. దీనిపై తనకుగానీ, తన పార్టీకి గానీ సంబంధం లేదని, విచారణ జరిగితే అన్ని సంగతులూ బయటకు వస్తాయని అన్నారు. తనపై పెట్టిన కేసుల గురించి ఏమీ వ్యాఖ్యానించబోనని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles