Nomination time end for GHMC polls

Nomination time end for ghmc polls

GHMC, GHMC Polls, GHMC Elections, TRS, MIM, TDP, Congress, Nominations for GHMC

The phase of filing of nominations for GHMC elections has ended at 3pm on Sunday. For the 150 divisions in the GHMC, nearly 1500 nominations have been filed by the candidates from various parties on the last day for the 'greater war'. There was a huge rush at the nomination centers since morning where dozens of nominations have been filed for each ward.

ముగిసిన నామినేషన్లు.. వేడెక్కిన గ్రేటర్ వాతావరణం

Posted: 01/18/2016 11:49 AM IST
Nomination time end for ghmc polls

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు అంతా సిద్దమైంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఎంతో ఉత్సాహంగా తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఇక నామినేషన్ల పర్వానికి ముందు అన్ని పార్టీ కార్యాలయాల వద్ద సందడే సందడి నెలకొంది. కాగా అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో ప్రధాన పార్టీలు ఆచితూచి వ్యవహరించాయి. ఏ పార్టీ కూడా పూర్తి జాబితాను విడుదల చేయలేదు. అత్యధికంగా అధికార టీఆర్ఎస్ పార్టీ 143 మంది పేర్లను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 94 డివిజన్లకు మాత్రమే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అటు టీడీపీ కూడా చివరి నిమిషంలో లిస్ట్ రిలీజ్ చేసింది.

ఇక ఎంఐఎం 75 సీట్లలో పోటీకి సిద్ధమైంది. రెబల్స్ బెదడ ఎక్కువవడంతో ఫోన్ల ద్వారా అభ్యర్థులకు సమాచారం అందవేశాయి పార్టీలు. కాగా నామినేషన్లను నేటి నుండి పరిశీలించనున్నారు.కాగా తమకు సీటు రాని వాళ్లు మాత్రం తమ తమ పార్టీలను తిట్టిపోస్తున్నారు. పార్టీని నమ్ముకున్నా కానీ చివరి క్షణంలో కావాలనే వేరే వాళ్లకు టికెట్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఉపసంహరణ గడువు జనవరి 21వ తేదీతో ముగియనుంది. ఫిబ్రవరి 2వ తేదీన పోలింగ్ జరగనుంది.  ఫిబ్రవరి 5వ తేదీన కౌంటింగ్ చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. దాదాపుగా 150 డివిజన్లకు గాను 1500 పైచిలుకు నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నామినేషన్లు వేసిన అభ్యర్థులు అప్పుడే తమ తమ బలాన్ని కూడగట్టుకుంటున్నారు. ఎలాగైనా సరే విజయం సాధించాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  GHMC Polls  GHMC Elections  TRS  MIM  TDP  Congress  Nominations for GHMC  

Other Articles