ఒకే ఫోటో.. ఒకే ఒక్క ఫోటో.. ముఖ్యమంత్రి నుండి అధికారుల వరకు అందరికి తలనొప్పిని తీసుకువచ్చింది. ఆ ఒక్క ఫోటో చూసిన నెటిజన్లు ప్రభుత్వం మీద తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టేశారు.. అసలే టైం బ్యాడ్ అనుకుంటున్న సిఎం హుటాహుటిన మ్యాటర్ ఏంటా అని ఆరా తీశారు. పాపం తర్వాత తెలిసింది అదో పాత ఫోటో. దాన్ని మళ్లీ ఇంటర్ నెట్ లో పెట్టేసరికి నెటిజన్లు షేర్ చేశారని.. దాంతో సీన్ సితారైందని. ఇదంతా ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది అనుకుంటున్నారా..? అయితే మొత్తం చదవండి.
కార్ల రాకపోకలను నియంత్రించడానికి దిల్లీలో నాలుగురోజులుగా సరిబేసి విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు.అయితే ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద ఇసుక పడితే రాలనంత జనంతో కిక్కిరిసి వెళ్తున్న మెట్రో రైలు ఫోటోను ఎవరో ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు. వెంటనే సోషల్ మీడియా యూజర్లు ముఖ్యంగా ట్విట్టర్ యూజర్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ సరిబేసి విధానం ఏంటంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
నిజానికి ఆ ఫోటో అక్టోబర్ 22, 2014వ తేదీన దీపావళి రోజు తీసిన ఫోటో. దీన్ని అప్పట్లో హిందుస్ధాన్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. దాన్నెవరో ఊరకనే ఉండక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇప్పటి ఫోటో అనుకున్న జనం వాస్తవం తెలుసుకోకుండా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే హిందుస్ధాన్ టైమ్స్ పత్రికఈ ఫోటోకు నగరంలో అమలౌతున్న సరిబేసి విధానానికి సంబంధం లేదని ట్వీట్ చేయడంతో యూజర్లు శాంతించారు. అయితే సరిబేసి విధానం వల్ల ఇబ్బందులు పడుతున్న కొందరు ప్రయాణికులు భారీ సంఖ్యలో పబ్లిక్ ట్రాన్స్ పోర్టును ఆశ్రయించారు. రద్దీని తట్టుకునేందుకు అదనంగా బస్సులు నడిపారు. మెట్రో రైళ్లు కూడా అదనపు ట్రిప్పులు తిరగాల్సి వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more