Another shock to telangana tdp, Vijayarama Rao joins trs

Vijaya ramarao joins trs

k vijaya rama rao, khairatabad, cbi former director, telugu desam party, ghmc elections,

Ahead of crucial GHMC elections, the TDP received yet another shock when former minister and former CBI director K Vijayarama Rao resigned from the party.

టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విజయరామారావు

Posted: 01/03/2016 11:22 AM IST
Vijaya ramarao joins trs

గ్రేటర్ హైదరాబాద్లో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి విజయరామారావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. విజయరామారావుకు, కేసీఆర్ టీఆర్ఎస్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపా హయాంలో విజయరామారావు ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి గెలుపొంది మంత్రిగా పనిచేశారు. ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని విజయరామారావు ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ పంచాయతీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విజయరామారావును ఆయన నివాసంలో కలుసుకొని పార్టీలోకి ఆహ్వానించారు.

దీంతో టీడీపీ అధ్యక్షుడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి విజయరామారావును బుజ్జగించారు. పార్టీలోకి తీసుకువచ్చి.. మేధావి వర్గం వుండాలని ప్రోత్సహించి మంత్రి పదవిని కూడా ఇచ్చానని, ఆ అంశాలన్నింటీనీ మరచి పార్టీ అపత్కాల సమయంలో అండగా వుండాల్సింది పోయి.. మీ దారి మీరు చూసుకుంటారా.. అయినా మీకు పార్టీలో గుర్తుంపు కల్సిస్తామని చంద్రబాబు హామీలు గుప్పించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో డొలాయమానంలో పడిన విజయరామారావు.. కొన్ని రోజుల పాటు మౌనంగా వుండి.. తన అనుచరగణంతో చర్చించిన తరువాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు మొగ్గుచూపడంతో కేసీఆర్ సమక్షంలో ఇవాళ టీఆర్ఎస్ ఖండువా ధరించారు. పార్టీలో ముఖ్య నేతగా పేరున్న మాజీ మంత్రి కె.విజయరామారావు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పడంతో తెలంగాణ టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijaya rama rao  kcr  trs  party  

Other Articles