AP Assembly speaker Kodela appointed a commitee on Roja suspension

Ap assembly speaker kodela appointed a commitee on roja suspension

Assembly, Roja, Ap Assembly, Roja in AP, Roja suspension

AP Assembly speaker Kodela appointed a commitee on Roja suspension. Mandali Budda as the chaiman for the commiittee.

రోజా సస్పెన్షన్ పై కమిటి.. 20 రోజుల్లో రిపొర్ట్

Posted: 01/02/2016 03:04 PM IST
Ap assembly speaker kodela appointed a commitee on roja suspension

వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ వ్యవహారంపై నలుగురు సభ్యులతో కమిటీని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ ను అధ్యక్షుడిగా నియమించారు. ఈ కమిటీ సభ్యులుగా టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌, వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌-రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు నియమితులయ్యారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై 20 రోజుల్లో ఈ కమిటీ సభాపతికి నివేదిక అందజేయాలని స్పీకర్ కోడెల ఆదేశించారు. ఇటీవల జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

కాగా రోజాను అధికారం లేకుండానే ఏడాది పాటు సస్పెండ్ చేశారంటూ వైసీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభా పక్షం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా సభ్యులంతా శీతాకాల సమావేశాలను వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఏపి అసెంబ్లీలో రోజా చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించిన స్పీకర్ ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అయితే రోజా ఎమ్మెల్యే అనితతో సహా, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మీద వాడకూడని భాష వాడినట్లు సభ్యులు మండిపడ్డారు. దాంతో ఎమ్మెల్యే అనిత, యనమల రామకృష్ణుడు ఆమెను సభ నుండి సస్పెండ్ చేయాలని సిఫారిసు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assembly  Roja  Ap Assembly  Roja in AP  Roja suspension  

Other Articles