overwhelmed-by-success-of-odd-even-scheme-kejriwal

Aap calls odd even plan a success arvind kejriwal channels john lennon

odd and even number plates,Aam Aadmi Party,AAP,odd even car days,Arvind Kejriwal,pollution,Delhi pollution,Delhi air quality,Odd Even Car Rule

Delhi's new odd-even plan for cars took off today in a drastic step to cut down smog in the world's most polluted city. Chief Minister Arvind Kejriwal says he is "overwhelmed by the response."

‘సరి బేసి’ సంఖ్య కార్ల వాడకంపై అనూహ్య స్పందన

Posted: 01/01/2016 01:29 PM IST
Aap calls odd even plan a success arvind kejriwal channels john lennon

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్య నియంత్రణకు ఆఫ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సరి-బేసి సంఖ్యల విధానానికి ఢిల్లీ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ విధానాన్ని ఢిల్లీ ప్రజలు హృదయపూర్వకంగా అంగీకరించారని పేర్కొన్నారు. కాలుష్య కాసారాన్ని భవిష్యత్ తరాలకు శాపంగా పరిగణిస్తుందని, దానిని వారికి అందించకుండా చర్యలు తీసుకోవడంలో ప్రతి ఒక్కరు భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత తరం వారు కూడా అనారోగ్యం బారిన పడి అరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారని అన్నారు. ఇందులో భాగంగా తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సరి-బేసి విధానానికి అనూహ్య స్పందన లభిస్తోంది.

రోడ్లపై కార్లు తక్కువగా కన్పిస్తున్నాయి. ఈ పథకం తప్పకుండా విజయవంతమవుతుంది' అని మీడియాతో చెప్పారు. పెద్ద సవాళ్లను అధిగమించగలమని ఢిల్లీ ప్రజలు రుజువు చేశారని ప్రసంసించారు. దేశానికి మార్గసూచిలా నిలిచారని కితాబిచ్చారు. తన కారులో మరో నలుగురితో కలిసి తాను కార్యాలయానికి వెళ్లినట్టు ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇద్దరు మంత్రులు, తన వ్యక్తిగత కార్యదర్శి, సంయుక్త కార్యదర్శిలను కారులో ఎక్కించుకున్నానని తెలిపారు. సరి-బేసి విధానం అమలుపై సానుకూల స్పందన వ్యక్తం కావడం పట్ల ఆయన హర్షం వెలిబుచ్చారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Odd Even rule  Delhi Pollution  Arvind Kejriwal  

Other Articles