my-husband-took-photos-to-complain-seniors-says-wife-of-infosys-rape-accused

My husband is innocent took photos of rape to complaint seniors

Rape at Infosys campus,Infosys rape,Pune crime,Prakash Mahadik,Pune rape,Swapna Mahadik,Pune Infosys campus,Paritosh Bagh ,rape, infosys campus, man took photos, husband innocent

"My husband is innocent. He only filmed the duo to show seniors the wrongful practices being carried out in the premises," claims Swapna Mahadik, wife of Prakash Mahadik.

మా ఆయన చాలా మంచోరు.. రేప్ జరుగుతుందని ఫోటోలు తీశారంతే..

Posted: 12/31/2015 05:49 PM IST
My husband is innocent took photos of rape to complaint seniors

నా భర్తకు చాలా మంచోడు, అతనికి ఏమీ తెలియదు.. అతడు నిర్దోషి.. హద్దులు దాటి తప్పుగా  ప్రవర్తిస్తున్న ఇద్దరిపై ఉన్నతాదికారులకు పిర్యాదు చేయడంలో భాగంగా ఆయన వారి తప్పుడు చర్యలను ఫోటోలు తీశాడని అంతేకానీ అతను అత్యచారం వంటి దారుణాలకు పాల్పడేంత కఠినాత్ముడు కాదని ఈ కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న ప్రకాష్ మహాదిక్ సతీమణి స్వప్న మహాదిక్ అన్నారు. అంతేతప్ప తన భర్త రేప్ చేయలేదని పుణె ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో రేప్ కేసులో నిందితుడు ప్రకాష్ మహాదిక్ భార్య స్వప్న అన్నారు.

పరితోష్ బాఘ్ (21) అనే క్యాంటీన్ ఉద్యోగి తన సహచర ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో తన భర్త అరెస్టయ్యాడన్న విషయం తెలిసి స్వప్న పుణె చేరుకుంది. వాళ్లిద్దరూ టాయిలెట్‌లో అభ్యంతరకర పరిస్థితిలో ఉండగా ఆధారం కోసం తన భర్త ఫొటోలు తీశాడని, ఆ విషయాన్ని వాళ్లకు చెప్పేలోపే తప్పుడు కేసులో అతడిని ఇరికించారని ఆమె వాపోయింది. గత వారం కూడా తమ ప్రాంతంలో కొందరు యువకులు ఓ మహిళను ఏడిపిస్తుంటే వాళ్లతో గొడవపడ్డాడని  ప్రకాష్ మహాదిక్ సతీమణి స్వప్న తెలిపారు.

ఇదిలా వుండగా, క్యాంటీన్ బి3 భవనంలో ఉందని, అత్యాచారం మాత్రం బి12 భవనంలో జరిగిందని, క్యాంటీన్లోనే టాయిలెట్ ఉండగా.. ఆ మహిళ అంత దూరం వేరే భవనంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రకాష్ మహాదిక్ సోదరుడు మహేంద్ర మహాదిక్ ప్రశ్నించాడు. అయితే.. సంఘటన జరిగిన తీరు చాలా దారుణంగా ఉందని, అందుకే తాము కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని క్యాంటీన్ యజమాని ప్రభాకర్‌ శెట్టి చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  infosys campus  man took photos  husband innocent  

Other Articles