Indore textile firm to cough up $100,000 for using pirated software

Madhya pradesh firm to pay rs 66 lakhs for using pirated software

prathiba syntex, pratibha syntex fine, pratibha syntex pirated software, pirated software, Madhya Pradesh, Pratibha Syntex Ltd, USA, indore news, india news

Pratibha Syntex gained an unfair competitive advantage over American-based companies by using pirated software in the production of clothing imported and sold in California, read the law suit.

ఫైరసీ సాఫ్ట్ వేర్ వాడిన ప్రతిఫలం.. భారత సంస్థకు 66 లక్షల జరిమానా..!

Posted: 12/30/2015 06:56 PM IST
Madhya pradesh firm to pay rs 66 lakhs for using pirated software

భారత్‌కు చెందిన ఓ టెక్స్‌టైల్ కంపెనీ యజమానికి అమెరికా రూ. 66 లక్షల జరిమానా విధించింది. పైరెటేడ్ సాఫ్ట్‌వేర్ వాడినందుకే మధ్యప్రదేశ్‌లోని ప్రతిభ సింటెక్స్ లిమిటెడ్ కంపెనీ యజమానికి జరిమానా విధించినట్లు అమెరికా వెల్లడించింది. అమెరికాకు చెందిన అగ్రశ్రేణి కంపెనీలకు ప్రతిభ సింటెక్స్ లిమిటెడ్ కంపెనీ పెద్ద ఎత్తున వస్ర్తాలను ఎగుమతి చేస్తుంది. ఈ క్రమంలో ప్రతిభ కంపెనీ పైరేటెడ్ సాఫ్ట్‌వేర్ వాడి అక్రమ వ్యాపారం చేసినట్లు వెలుగు చూసింది.

పైరెటేడ్ సాఫ్ట్‌వేర్ వాడటం వల్లనే పలు కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, అమెరికా సాఫ్ట్‌వేర్ కంపెనీలు కొత్త ఉత్పత్తులను తయారు చేసుకోలేక పోయిందని కాలిఫోర్నియా అటర్నీ జనరల్ కమలా హారిస్ అన్నారు. ఇక అక్రమ వ్యాపారం చేసిన ప్రతిభ సింటెక్స్ లిమిటెడ్ కంపెనీకి అమెరికాలోని కాలిఫోర్నియా న్యాయస్థారనం రూ. 66 లక్షలు జరిమానా విధించింది. రూ. 66 లక్షలను నెల రోజుల్లోనే చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

యావత్ ప్రపంచం ఇలాంటి దుశ్చర్యలను ఖండించాలని, ఫైరసీ సాఫ్ట్ వేర్ లను వాడితే జరిగే పరిణామాలు ఎంత తీవ్రంగా వుంటాయో కూడా గమనించాలని న్యాయస్థానం పేర్కోంది. ఒకరి మేధోసంపత్తిని అక్రమంగా దొంగలించి వినియోగించడం ఎంత పెద్ద నేరమో కూడా అర్థం కావాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాగా ఫైరసీ సాఫ్ట్ వేర్ వినియోగించిన కేసులో తొలిసారిగా భారత్ కు చెందిన ఒక అంతర్జాతీయ సంస్థపై న్యాయస్థానం జరిమానా విధించిందని న్యాయనిపుణ వర్గాలు పేర్కోంటున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pirated software  Madhya Pradesh  Pratibha Syntex Ltd  USA  

Other Articles