ISIS daparture from Ramadi city of Iraq

Isis daparture from ramadi city of iraq

ISIS, Iraq, Ramadi, Iraqi soldiers, Iraq military, Islamic state fighters, Iraq flag

Iraq's military flew the Iraqi flag above the main government complex in the city of Ramadi, a military spokesman said, the day after the army declared the provincial capital captured in its first major victory over Islamic State fighters.

రమాదీ నగరం నుండి ఐఎస్ఐఎస్ పరార్

Posted: 12/29/2015 10:01 AM IST
Isis daparture from ramadi city of iraq

ప్రపంచంలో తీవ్ర నేరాలకు పాల్పడుతూ.. వణుకు పుట్టిస్తున్న ఐఎస్ఐఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది.ఇరాక్ లో ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా గాలి వీస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెర నుంచి రమాదీ నగరాన్ని ఇరాక్ సేనలు దాదాపు చేజిక్కించుకున్నాయి. తాజాగా నగరంలోని ప్రభుత్వ బిల్డింగ్‌ను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. గవర్నమెంట్ కాంప్లెక్స్ పూర్తిగా తమ ఆధీనంలో ఉందని, ఆ ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదుల ఆనవాళ్లు లేవని సైనికాధికారి తెలిపారు. దీంతో నగరంలో ఐసిస్ ఛాయలు లేకుండాపోయాయన్నారు.

కానీ మే నెల నుండి రమాదీ మీద ఐఎస్ఐఎస్ ఆదిపత్యం చలాయిస్తూ రావడంతొ.. అక్కడక్కడ మందు పాత్రలు అమర్చడంతో పాటు, గుర్తు తెలియని ప్రదేశాల్లో ఆయుధాలను దాచి పెట్టినట్లు సైనిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే సైన్యానికి, ఐఎస్ఐఎస్ మధ్య జరిగిన పోరులో ఎంత మంది చనిపోయారు అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. కొన్ని వారాల నుంచి రమాదీ నగరాన్ని చేజిక్కించుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బాగ్దాద్‌కు సమీపంలో ఉన్న సున్నీ ఆధిపత్య నగరం రమాదీలో గత మే నెల నుంచి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఆధీనంలో ఉండిపోయింది.  మళ్లీ చాలా కాలం తర్వాత ఇరాక్ సైనికులు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Iraq  Ramadi  Iraqi soldiers  Iraq military  Islamic state fighters  Iraq flag  

Other Articles