Soon one-page form for birth, death and several services

No more affidavits interviews for government jobs

Lok Sabha, Jitendra Singh, Government jobs, Government employees, Affidavit, Minister of State for Development of North Eastern Region (I/C),Prime Minister's Office, Personnel,Public Grievances & Pensions, Minister of State for Personnel Jitendra Singh,Good Governance Day,Good governance,One-page forms,Government schemes,Welfare Schemes

discontinuation of affidavits for host of government services and ending job interviews for various posts from January 1 among other initiatives kept the Ministry of Personnel in news during 2015.

గెజిటెడ్ సంతకాలు, అఫిడెవిట్లకు చెల్లు చీటి.. ఇకపై అంతా స్వంత దృవీకరణే..

Posted: 12/27/2015 12:59 PM IST
No more affidavits interviews for government jobs

ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారు సర్టిఫికెట్ల ధ్రువీకరణ కోసం ఇకపై గెజిటెడ్‌ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరంలేదు. ఉద్యోగ పరీక్షలో మెరిట్‌ సాధించాక ఇంటర్వ్యూ రూపంలో అధికారులను సంతృప్తి పరచవలసిన అవసరమూ లేదు. ఎందుకంటే ఈ రెండు అంశాలనూ రద్దు చేయాలని ఇంతకుముందే నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. వచ్చే జనవరి 1 నుంచే దీనిని అమలులోకి తీసుకురానుంది. గెజిటెడ్‌ అధికారుల ధ్రువీకరణతో పనిలేకుండా ఉద్యోగార్థులే స్వయంగా ధ్రువీకరణ పత్రం సమర్పించే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది, ప్రజా వ్యవహారాల సహాయమంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు.

దేశ పౌరుల పట్ల ప్రభుత్వానికి విశ్వాసముందన్న విషయాన్ని చాటేందుకు, ప్రత్యేకించి యువత తప్పుడు ధ్రువీకరణ ఇవ్వరన్న సంకేతాలు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రధానంగా గెజిటెడ్‌ అధికారులు అందుబాటులోలేని గ్రామీణ ప్రాంత యువతకు ఊరట లభించనుంది. దీనిని అమలు చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అదేశించింది. ప్రత్యేకించి గ్రూప్‌ సి, డి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేయాలని సూచించింది. కారుణ్య నియామకాలకు సంబంధించి కుటుంబసభ్యుల నుంచి ధ్రువీకరణ సమర్పణనూ కేంద్రం ఇటీవలే రద్దు చేసిన విషయం తెలిసిందే

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lok Sabha  Jitendra Singh  Government jobs  Government employees  Affidavit  

Other Articles