Delhi odd-even scheme: Robert Vadra criticises exemptions granted to VIPs

Vadra slams exemptions granted to vips in rationing scheme

robert varda, odd even scheme, robert vadra odd even scheme, delhi odd even scheme, delhi odd even exemption, vadra vip exemption odd even scheme, delhi news, ncr news, india news

"Odd and Even ways !! Creating parallel lists of exemption, is complete hypocrisy. If a law is implemented in the interest of the people, we all must adhere, and not be VIPs," said Varda.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై వాద్రా ఫైర్

Posted: 12/26/2015 03:54 PM IST
Vadra slams exemptions granted to vips in rationing scheme

ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఎట్టకేలకు సామాన్యుడి తరపున తన గళాన్ని వినిపించాడు. అంతేకాదు అమ్ ఆద్మీ వ్యవస్తాపక అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలు ఎక్కుపెట్టారు. సామాన్యుల పార్టీ పేరుతో, సామాన్యుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్.. సామాన్యులకు ఒక చట్టం, వీఐపీలకు మరో చట్టం అంటూ విడదీయడం సమంజసం కాదని ఆయన దుయ్యబట్టారు. కాలుష్య నివారణ కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'బేసి-సరి పథకం' నుంచి వీఐపీల వాహనాలకు మినహాయింపు ఇవ్వడాన్ని వాద్రా తప్పుపట్టారు.

'బేసి-సరి పథకంలో మినహాయింపు ఇవ్వడం పూర్తిగా వంచనే. ప్రజాప్రయోజనాల కోసం ఓ చట్టాన్ని అమలు చేసినపుడు మనమందరూ పాటించాలి. వీఐపీలకు మినహాయింపు ఇవ్వరాదు' అని వాద్రా తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని నివారించడం కోసం ఢిల్లీ రోడ్లపై బేసి-సరి నెంబర్లు గల వాహనాలను రోజు మార్చి రోజు అనుమతించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే 2 వేల రూపాయలు జరిమానా వేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే వీఐపీలకు మినహాయింపు ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయని వాపోయారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Robert Vadra  odd-even scheme  Delhi government  Arvind Kejriwal  

Other Articles