all roads in telangana leads to eeravalli for ayutha chandi yagam

Devotees throng to eeravalli for ayutha chandi yagam

Erravalli, Devotees Onslaught, Ayutha Chandiyagam, kcr, telangana cm, continuous christmas holidays, eeravalli tourist spot, eeravalli pilgrimage, all roads in telangana leads to eeravalli, all roads in telangana leads to ayutha chandi yagam

continuous christmas holidays make all roads in telangana leading towards a tourist spot, a pilgrimage that is eeravalli, whare telangana cm kcr is performing ayutha chandi yagam

ఎర్రవల్లికి పోటెత్తుతున్న భక్తజనం.. అధికారుల్లో అందోళన..

Posted: 12/25/2015 05:50 PM IST
Devotees throng to eeravalli for ayutha chandi yagam

తెలంగాణలోని అన్ని రోడ్లు.. ఒకే వైపుకు దారి తీస్తున్నాయి. అదే ఎర్రవల్లి.. ఇప్పుడదో పుణ్యక్షేత్రం. ఒక పర్యాటక ప్రాంతం. గతంలో ఆ గ్రామానికి ఆ మండలవాసులకు కూడా చూసివుండరు. కానీ ప్రస్తుతం అదే గ్రామం ఒక ధార్మిక వేడుక.  1,500 మంది రుత్విజులు ఏకధాటిగా చండీ సప్తశతి పారాయణంతో నిర్వహించే మహా యాగం కావడం, స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తుండటంతో భక్తుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. దీంతో తొలిరోజే భక్తులు పోటెత్తారు. రెండోరోజు వారి సంఖ్య రెట్టింపైంది. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవు కావటంతో వారి సంఖ్య మరింత పెరగనుంది.

ఇప్పుడిదే అధికారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తితే నియంత్రించటం కష్టమవుతుందని పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే రోజుల్లో అయుత చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు రానుండటంతో భక్తుల నియంత్రణ సవాల్‌గా మారుతుందని భావిస్తున్నారు. దీంతో భక్తుల రద్దీని నియంత్రించక తప్పదని ఇతర విభాగాల అధికారులతో పోలీసులు పేర్కొంటున్నారు.

ఇందులో భాగంగా ఆర్టీసీకి ప్రత్యేకంగా విన్నవించారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వరుసగా సెలవులు ఉండటంతో బస్సులు పెంచాలని ఆర్టీసీ తొలుత నిర్ణయించింది. కానీ పెంచితే ఎర్రవల్లికి తాకిడి భారీగా ఉంటుందని, బస్సులు తగ్గించాలని పోలీసులు ఆర్టీసీని కోరారు. ఉదయం భారీగా తగ్గించి.. కొన్నింటిని మాత్రమే మధ్యాహ్నం, సాయంత్రం నడపాలని సూచించారు. ఒకే సమయంలో ఎక్కువమంది రాకుండా.. సాయంత్రానికి మళ్లించాలనేది వారి ఆలోచన. దీంతో బస్సుల సంఖ్యను తగ్గించి పరిమితంగానే నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Erravalli  Devotees Onslaught  Ayutha Chandiyagam  kcr  telangana cm  

Other Articles