Google to open new campus at Hyderabad: CEO Sundar Pichai

Sundar pichai pitches google loon for internet access in rural india

sundar pichai, sundar pichai meets narendra modi, sundar pichai in delhi, google ceo in delhi, narendra modi sundar pichai, narendra modi, sundar pichai event in delhi, sundar pichai in shree ram college, google ceo india visit, sundar pichai india visit, google news

Google CEO Sundar Pichai announces huge campus in Hyderabad. It will deploy WiFi at 100 railway station in partnership with Railtel

హైదరాబాద్ లో గూగుల్ కొత్త క్యాంపస్ త్వరలో.. సుందర్ పిచ్చాయ్

Posted: 12/16/2015 04:36 PM IST
Sundar pichai pitches google loon for internet access in rural india

గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ హైదరాబాద్ కు ఇదివరకే ప్రకటించిన శుభవార్తను త్వరలోనే చేపడతామని చెప్పారు. ప్రముఖ ఐటి సంస్థ గూగుల్ తన కొత్త క్యాంపన్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. దేశ అవసరాలకు తగిన విదంగా కొత్త ఉత్పత్తుల తయారీకి కొత్త కాంపస్ అవసరమని, దానిని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారతదేశంలోని వంద రైల్వే స్టేషన్లకు 2016 డిసెంబర్ నాటికల్లా వై-ఫై సదుపాయం కల్పిస్తామని చెప్పారు. రైల్ టెల్ సహకారంతో దీనిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

భారతదేశంలో ఇంటర్‌నెట్ వాడకాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా పిచాయ్ పర్యటన సాగుతున్నట్లు తెలుస్తోంది. సామాన్యుడి చెంతకు కూడా టెక్నాలజీని తీసుకెళ్లాలన్నది పిచాయ్ వ్యూహమని చెబుతున్నారు. దేశంలోని 3 లక్షల గ్రామాల మహిళలకు ఇంటర్ నెట్ సదుపాయం కల్పించేందుకు గూగుల్ సాయం చేస్తుందన్నారు. ఇక ఉపఖండంలో క్రికెట్ క్రీడకు వున్న ప్రాధాన్యతను తెలుసుకున్న గూగుల్ నూతన సంవత్సరం నుంచి క్రికెట్ అప్ డేట్స్ కూడా అందించేందుకు సిద్దమవుతుంది. సుందర్ పిచ్చాయ్  పర్యటనలో ప్రధానంగా ఐదు అంశాలను ప్రస్తావిస్తున్నారు.  

* భారతదేశంలోని వంద రైల్వే స్టేషన్లలో రైల్‌టెల్ సహకారంతో 2016 డిసెంబర్ నాటికల్లా వై-ఫై సేవలు
* మూడేళ్లలో భారతదేశంలోని 3 లక్షల గ్రామాల్లో మహిళలకు ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించేందుకు గూగుల్ సాయం
* భారతదేశం కోసం ఉత్పత్తులు తయారుచేసేందుకు హైదరాబాద్‌లో 'ఇంజనీరింగ్ ప్రెజెన్స్'ను పెంచడం
* 11 భాషల్లో టైప్ చేసేందుకు ఉపయోగపడే గూగుల్ 'ఇండిక్' కీబోర్డు
* 2016 నుంచి గూగుల్ సెర్చ్ ద్వారా లైవ్ క్రికెట్ అప్‌డేట్లు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sundar pichai  google ceo  wifi to railway stations  sundar pichai india tour  

Other Articles